డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేట రైల్వే స్టేషన్ సర్కిల్ సమీపంలోని ఉషోదయ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల సర్కిల్ నందు పట్టణంలోని స్పందన హాస్పిటల్ వారిచే నిర్వహించబడిన ఉచిత షుగర్ బిపి పరీక్షలకు విశేష స్పందన రావడం జరిగిందని స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియాలుతెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో 236 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. షుగర్ ఎక్కువ తేడా ఉన్నవారికి స్పందన ఆసుపత్రి నందు మరుసటి రోజు కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను ప్రజలు డాక్టర్ సోనియాకు డాక్టర్ బషీర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో స్పందన ఆసుపత్రి సిబ్బంది రాము, దిల్దార్, శారీక్, చందన, సుకన్, యశస్విని తదితరులు పాల్గొన్నారు.
ఉచిత షుగర్ బిపి పరీక్షలకు విశేష స్పందన..
- Advertisement -
RELATED ARTICLES


