Saturday, March 7, 2026
Homeజిల్లాలుఏలూరువైద్య రంగంలో నిత్య కృషీవలుడు పద్మశ్రీ నారాయణరావు

వైద్య రంగంలో నిత్య కృషీవలుడు పద్మశ్రీ నారాయణరావు

- Advertisement -

విశాలాంధ్ర -భీమవరం టౌన్ ; వై ద్య రంగంలో ఎన్నో మైలురాళ్లను దాటిన నిత్య కృషీవలుడు పద్మశ్రీ అది నారాయణరావు అని ఎల్హెచ్ టౌన్ హాల్ గౌరవాధ్యక్షులు మెంటే పార్ధసారధి, అధ్యక్ష, కార్యదర్శులు కోళ్ల రామచంద్రరావు, బేతు కృష్ణారావు అన్నారు. ఎల్ హెచ్ భీమవరం టౌన్ హాల్లో పద్మశ్రీ డా సుంకర అది నారాయణరావు సంతాప సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ పేద ప్రజలే దైవంగా భావించి, ఎంతోమందికి వైద్య సేవలు అందించిన గొప్ప వ్యక్తి నారాయణరావు అని అన్నారు. 20 లక్షల మందికి పైగా పోలియో వ్యాధి గ్రస్తులకు ఉచితంగా ఆపరేషన్లు చేసి నడకను ప్రసాదించి మరెంతో మందికి ఉపాధిమార్గం చూపించారన్నారు. విద్యాదాతగా, ఆరోగ్య ప్రదాతగా, మృదుస్వభావిగా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచ మార్గదర్శకులు వైద్య రంగంలో ఎన్నో మైలురాళ్ళను దాటిన నిత్య కృషీవలుడని నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మేళం శ్రీధర్ ప్రభాకర్, అడబాల రామకృష్ణ, గ్రంధి సురేష్, గేద్ద ఫిరోజ్ బాబు, ఆకుల శ్రీను, అడపా బాబ్జి, దవ్వే దుర్గారావు, యాతం జగన్నాథం, కాళీ చంటి, మేళం నాగేశ్వరరావు, గుత్తికొండ శంకర్రావు, అల్లూరి కోటేశ్వరరాజు, అగీశెట్టి నాని, ఎం ఎస్ బెగ్, నల్లం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు