Homeజాతీయంపహల్గాం ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్‌తో లింకు

పహల్గాం ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్‌తో లింకు

- Advertisement -

ఫోన్ల ద్వారా బయటపడిన విషయం
న్యూదిల్లీ:
పహల్గాం ఉగ్ర కుట్రలో పాకిస్థాన్ మÖలాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఉగ్రదాడితో పాకిస్థాన్‌లోని ఓ ప్రముఖ బ్యాంక్‌కు లింక్ ఉన్నట్లు తాజాగా బయటపడింది. ఉగ్రమూకలు వాడిన ఫోన్లలో ఒక దానికి చెందిన కన్సైన్‌మెంట్ ఫైనాన్స్‌ను పాక్‌లోని ఫైసల్ బ్యాంక్ చేసినట్లు గుర్తించారు. గతంలోనూ ఉగ్ర కార్యకలాపాల్లో ఈ బ్యాంకు పేరు వినిపించింది. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి దర్యాప్తు బృందాలు రెండు షావోమి హ్యాండ్‌సెట్లను స్వాధీనం చేసుకొన్నాయి. వీటిల్లో ఒక దానిని కరాచీకి చెందిన టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్ 2021లో దిగుమతి చేసుకొన్నట్లు గుర్తించారు. ఈ కన్సైన్‌మెంట్ లావాదేవీలకు ఫైసల్ బ్యాంక్ ఫైనాన్సింగ్ చేసింది. కాకపోతే పహల్గాం దాడిలో ఈ బ్యాంక్ హస్తం నేరుగా ఉన్నట్లు బయటపడలేదని అధికారులు వెల్లడించారు. అయితే, పాక్ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తయ్యిబా, లజ్‌నత్ అల్ దవాతో పాటు అల్-ఖైదాతో సంబంధాలున్న ఓ కువైట్ సంస్థ గతంలో ఫైసల్ బ్యాంక్‌తో కలిసి పనిచేశాయి. పాక్‌లోని రెండు ఉగ్ర సంస్థలు ఈ బ్యాంక్‌లో తమ డిపాజిట్లను నిర్వహిస్తున్నాయని 2007లో అమెరికా పత్రిక ఒకటి తమ కథనంలో పేర్కొంది. ఉగ్రవాదులకు సాయంగా భారత్‌లోకి అక్రమంగా టెలికామ్ సంకేతాలు అందుతున్నాయి. పాక్ దుశ్చర్య పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఫైసల్ జాట్ తనతోపాటు రెండు ఫోన్లను తీసుకొచ్చాడు. అవి షావోమీ రెడ్‌మీ సిరీస్‌కు చెందిన 9టీ, నోట్ 12 ఫోన్లు. వీటిని 2021, 2023ల్లో దిగుమతి చేసుకొన్నారు. అయితే ఈ ఫోన్లను పహల్గాం ఉగ్రదాడి వరకు ఎక్కడా వాడలేదు. ఎంపిక చేసిన ఉగ్రవాదికి వాటిని అప్పగించాలనే వాటిని స్విచ్ ఆన్ చేయకుండా ఉంచారని అనుమానం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు