అహ్మదాబాద్: ఐపీఎల్ 2026 ఫైనల్ ఓటమితో నిరాశలో ఉన్న గుజరాత్ టైటాన్స్(జీటీ) టీమ్‌కు పెను ప్రమాదం తప్పింది. మూలిగే నక్కపై తాటిపండు. పడ్డట్టయింది టైటాన్స్ పరిస్థితి. ఫైనల్ మ్యాచ్ అనంతరం అహ్మదాబాద్ స్టేడియం నుంచి హోటల్‌కు తిరుగు ప్రయాణమైన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ప్లేయర్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. అదృష్టవశాత్తు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు సమాచారం. జట్టు సభ్యులు దాదాపు గంటసేపు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. మరో బస్సు ఏర్పాటు చేసి క్షేమంగా ప్లేయర్లను, సిబ్బందిని హోటల్‌కు చేర్చాచారు.
ఫైనల్లో నిరాశ…
ఇదిలా ఉంటే… ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)పై గుజరాత్ టైటాన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో రెండోసారి కప్ప్పు అందుకోవాలన్న కల జీటీకి కలగానే మిగిలిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్…155/8 స్కోరుకే పరిమితం అయింది. ఛేదనలో ఆర్సీబీ 18 ఓవర్లలోనే ఆటను ముగించి వరుసగా రెండోసారి ట్రోఫీని అందుకుంది. ఫైనల్‌లో ఓటమి బాధ నుంచి కోలుకోకముందే బస్సు ప్రమాదం వారిని భయాందోళనకు గురిచేసింది.
బస్సులో మంటలు…జీటీ టీమ్‌కు తప్పిన ముప్పు
- Advertisement -
RELATED ARTICLES


