జిల్లా మహాసభలు జయప్రదం చేయండి…
విశాలాంధ్ర- అనంతపురం : ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పిలుపు
అనంతపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో యువజన సమాఖ్య నాయకులు గోడ పత్రాల,కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ… దేశ, రాష్ట్రలోను పాలకుల విధానాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగావిఫలమైందని ఆరోపించారు. దేశంలో అన్ని రంగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని వాటిని భర్తీ చేయకుండా ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యకు 25 శాతం నిధులు కేటాయిస్తే మన దేశంలో కేవలం 6.5 శాతం కేటాయించి చేతులు దులుపుకుంటున్నారని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల వైపు యువతను ప్రొత్సహిస్తుంటే మన దేశంలో యువత కులం, మతం, సనాతన ధర్మం అంటూ తిరోగమనం వైపు నెట్టివేయబడుతున్నారని మండిపడ్డారు. సమాజ మార్పుకోసం జరిగే ప్రజా పోరాటాల్లో యువతరం ముందుండాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనకై పగతిశీల యువత నిరంతరం ఉద్యమించాలన్నారు. ఏఐవైఫ్ 20 జిల్లా మహాసభల్లో రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని , ప్రభుత్వా శాఖల్లో ఖాళీ ఉన్నా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలనీ అన్నారు. ఎన్నో పోరాట ఫలితంగా సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రవేటికరణ కు వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న దాడులకు ,వివిధ సామాజిక ,ఆర్థిక రాజకీయ, నూతన పరిశ్రమలు నెలకొల్పాలని, కియా పరిశ్రమల్లో 70 శాతం మంది ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. అనంత జిల్లా యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ 20 వ ఏ ఐ వై ఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ కృష్ణ, రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి ధనుంజయ, ఏఐవైఎఫ్ అనంతపురం నగర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ బాబు, శ్రీనివాస్, నగర సహాయ కార్యదర్శి రాంబాబు, శర్మస్, లక్ష్మి రంగ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.