బీసీ కార్పొరేషన్ ఈడి సుబ్రహ్మణ్యం కు వినతి పత్రం అందజేసిన చేతి వృత్తిదారుల సమైక్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు సి లింగమయ్య
విశాలాంధ్ర అనంతపురం : బీసీ రుణాలలో రాజకీయం జోక్యం లేకుండా చూడాలని బీసి కార్పొరేషన్ ఈడి సుబ్రహ్మణ్యం కు వినతి పత్రాన్ని శుక్రవారం అందజేసినట్లు చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు సి. లింగమయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీసీ కార్పొరేషన్ ఈడీ కి బిసీ రుణాలు అందరికీ మంజూరు అయ్యేలా చూడాలని అప్లికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. బీసీ రుణాల విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ మంజూరు అయ్యేలా పారదర్శకతతో అధికారులు చూడాలని అప్పుడే పేద వర్గాలకి అందుతాయని ఈడిని కోరడం జరిగిందన్నారు. లేనిపక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు సి నాగప్ప, మహిళా సమాఖ్య నగర కార్యదర్శి జానకి, నాయకులు నాగరాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.