Homeజిల్లాలుఅనకాపల్లిఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ సాధించిన పొన్నా శ్రీ భారతి

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ సాధించిన పొన్నా శ్రీ భారతి

- Advertisement -

విశాలాంధ్ర -అనకాపల్లి : చిన్న వయసులోనే అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అనకాపల్లికి చెందిన పొన్నా సోమేష్ మనుమరాలు పొన్నా శ్రీ భారతి అనే ఏడాది 8 నెలల బుజ్జాయి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఫిబ్రవరి 28, 2024న జన్మించిన శ్రీ భారతి, తన అద్భుతమైన తెలివితేటలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కేవలం ఒక సంవత్సరం ఎనిమిది నెలల వయసులోనే ఈ చిన్నారి సాధించిన ఘనత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ చిన్నారి పండ్లు, కూరగాయలు ,జంతువులు,వాహనాలు,శరీర భాగాలు,ఇంగ్లీష్ ఆల్ఫాబేట్, ఇతర వస్తువులు కలిపి 250 కి పైగా చెప్తుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఈమె ప్రతిభను అధికారికంగా ధృవీకరించి ఃఅచీవర్ః సర్టిఫికెట్‌ను అందజేశారు. తమ కుమార్తె ఇంత చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల శ్రీ భారతి తల్లిదండ్రులు పొన్నా సోమేష్ హర్ష , వర్షిత హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుండే వస్తువులను గుర్తించడంలో శ్రీ భారతి చూపుతున్న ఆసక్తిని గమనించి, ఆమెను ప్రోత్సహించినట్లు వారు తెలిపారు. అనకాపల్లి వాసులు ఈ చిన్నారి సాధించిన విజయాన్ని చూసి గర్వపడుతూ, ఆమెకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు