మహిళా రిజర్వేషన్ల కోసం తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ నిర్ణయంపై విపక్షాలు జీవితాంతం పశ్చాత్తాపపడతాయని వ్యాఖ్యానించారు.ఆయన అధ్యక్షతన పార్లమెంట్ హౌస్‌లో శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించగా, మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్షాలు పెద్ద తప్పు చేశాయని ఆయన విమర్శించారు
దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షాలు సాకులు వెతుకుతున్నాయని ఆరోపించారు.
అలాగే ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకమనే విషయాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
అయితే ఈ బిల్లు 298-230 ఓట్ల తేడాతో వీగిపోయింది.


