Homeక్రీడలుప్రియాంశ్, కనోలీ అద్భుతంగా ఆడారు

ప్రియాంశ్, కనోలీ అద్భుతంగా ఆడారు

- Advertisement -

అలా షాట్‌లు కొట్టడానికి తెగింపు ఉండాలి: శ్రేయస్

క్రీడలు: ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతోంది. ఆరింట ఐదు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 భారీ పరుగులు చేసింది. ఇందులో యువ బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య (93), కనోలీ (87) చెలరేగారు. వీరిద్దరూ కలిసి 80 బంతుల్లో 186 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. లఖ్‌నవూపై పంజాబ్ బ్యాటర్లు మొత్తం 21 సిక్స్‌లు కొట్టడం గమనార్హం. స్పిన్‌తోపాటు పేస్ బౌలింగ్‌లోనూ భారీ షాట్లు కొట్టేశారు. దీనిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. అలా ఆడాలంటే ఎంతో తెగువ, చాలా ధైర్యం కావాలని వ్యాఖ్యానించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ’ ప్రియాంశ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘డగౌట్‌లో కూర్చొని ఆ ఇద్దరి భాగస్వామ్యం చూస్తుంటే భలేవుంది. ఒక దశలో వారి షాట్లు చూస్తే అబ్బురం అనిపించింది. బ్యాక్ ఫుట్ మీద ఫాస్ట్ బౌలర్లు వేసిన బంతులను సిక్స్‌లుగా మలిచారు. అలా ఆడాలంటే గొప్ప ధైర్యం కావాలి. అదే సమయంలో సంయమనం వహించాలి. ఎలాపడితే అలా కొడితే ఔటయ్యే ప్రమాదం ఉంది. మిడిల్ ఓవర్లలో ప్రియాంశ్-కనోలీ నిర్మించిన ఇన్నింగ్స్ హైలైట్. సిక్సర్ల గురించి జట్టు సమావేశాల్లో చర్చించుకుంటూ ఉంటాం. కనోలీ, ప్రియాంశ్‌తోపాటు ఇతర బ్యాటర్లకూ ఓ మాట చెప్పా. ఈ ఐపీఎల్‌లో ఎవరైతే ఎక్కువ సిక్స్‌లు కొడతారో వారికి నా బ్యాట్‌ను బహుమతిగా ఇస్తానని ఆఫర్ చేశా. ఇప్పటివరకూ మా కుర్రాళ్లు ఆడిన తీరు చాలా బాగుంది. స్వేచ్ఛ ఇస్తే ఎలాంటి ఫలితం వస్తుందో చూస్తున్నాం. ఏ జట్టుపై ఎవరు ఎలా ఆడతారనేది వారి ఇష్టం. ఈ విషయంలో మరీ ఎక్కువగా సూచనలు, సలహాలు ఇవ్వను. కోచ్ రికీ పాంటింగ్ కుర్రాళ్లలో స్ఫూర్తి నింపాడు’ అని శ్రేయస్ వెల్లడించాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు