వెంటనే రిలీవ్ కావాలని హైకోర్టు ఆదేశాలు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్డీవో మహేష్ ను, ఎంపీడీవో సాయి మనోహర్, డి.ఎస్.పి హేమంత్ కుమార్ ను వెంటనే రిలీవ్ చేయాలని కోరుతూ బదిలీ వేటు హైకోర్టు వేసింది. వివరాలకు వెళితే రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రావడం జరిగిందని, అమరావతి లోని జిఏడీలో రిపోర్ట్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీఎస్పీ మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేసుకోవాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు అధికారులు 2018 గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా పోస్టర్లకు ఎంపిక కావడం జరిగింది. ఉద్యోగ ఎంపిక విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎంపికైన అభ్యర్థులను షిట్ విచారణ నిమిత్తం కీలక పోస్టుల నుంచి అప్రధాన్య పోస్టులకు మార్చాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. మొత్తం మీద ధర్మవరంలో ముగ్గురు అధికారులు బదిలీ కావడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురు అధికారులు తమదైన శైలిలో అటు ప్రజలకు న్యాయాన్ని చేకూరుస్తూ, మంచి గుర్తింపు కూడా పొందారు.
ఆర్డీవో, ఎంపీడీవో, డీఎస్పీలు బదిలీ
- Advertisement -
RELATED ARTICLES


