Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపెచ్చులూడుతున్న గదులు.. తిరగని ఫ్యాన్లు -ఆరుబయటే మధ్యాహ్న భోజనం వంట....

పెచ్చులూడుతున్న గదులు.. తిరగని ఫ్యాన్లు -ఆరుబయటే మధ్యాహ్న భోజనం వంట….

- Advertisement -

మశానంపేట హైస్కూల్‌లో సమస్యల తిష్ఠ..

విశాలాంధ్ర – కదిరి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కదిరి మున్సిపల్ పరిధిలోని మశానంపేట హైస్కూల్‌లో కనీస సౌకర్యాలు కరవై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పాఠశాలలో వంటగది లేకపోవడంతో మధ్యాహ్న భోజనాన్ని ఆరుబయటే వండాల్సిన పరిస్థితి నెలకొంది. గాలి, వాన వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు బహిరంగ ప్రదేశంలోనే వంటకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.తరగతి గదుల్లో ఫ్యాన్లు పనిచేయకపోవడం, పైకప్పు పెచ్చులూడుతున్న పరిస్థితుల మధ్య సుమారు 43 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థుల పర్యవేక్షణ విషయంలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కొరవడిందని పలువురు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసిన షూలు సరైన సైజుల్లో లేకపోవడంతో విద్యార్థులకు ఉపయోగపడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎక్కువ, తక్కువ సైజుల షూలు పంపిణీ చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సమాచారం కోరేందుకు విద్యాశాఖ అధికారులను ఫోన్‌లో సంప్రదించినా స్పందించడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి: ఏఐఎస్ఎఫ్

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై విద్యాశాఖ అధికారులను పలుమార్లు సంప్రదించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారుల తీరును ఆయన ఖండించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు