Homeఆంధ్రప్రదేశ్సత్తిపండుకు సత్కారం

సత్తిపండుకు సత్కారం

- Advertisement -

కాటన్ విగ్రహ విదాత సత్తిపండుకు సత్కారం.

విశాలాంధ్ర – కడియం : ఎద్దుల బండి నడుపుకుంటూ జీవించే నిరుపేద వ్యక్తైనా లక్షలాది రూపాయలు వ్యయంతో కాటన్ దొర విగ్రహాన్ని నెలకొల్పి తల్లిదండ్రుల సంకల్పాన్ని నెరవేర్చిన దొడ్డా సత్తిపండుని బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గిరజాల బాబు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఆలమూరు మండలం సంధిపూడి గ్రామానికి చెందిన నిరుపేద కూలి వెంకయ్యకు పూర్వం నుంచి కాటన్ విగ్రహాన్ని నెలకొల్పాలనే కోరిక ఉండేది. అది తీరకుండానే ఆయన గతించారు. ఎడ్ల బండి తోలుకునే సాధారణ వ్యక్తి అయినా సత్తిపండు డబ్బులు కూడబెట్టుకుని దాదాపు 5 లక్షల రూపాయలు వ్యయంతో ఊరిలో కాటన్ దొర విగ్రహాన్ని, దానికి ఆనుకొని రైతులు సేదతీరే వేదికను మూడు సెంట్లు స్థలంలో ఏర్పాటు చేశారు. తమ తల్లిదండ్రులు వెంకయ్య, భూలోకమ్మ జ్ఞాపకార్థం దీని నిర్మించి సత్తిపండు తండ్రి కోరికను తీర్చాడు. ఈ విషయం తెలుసుకున్న గిరజాల బాబు తమ బాధ్యతా సేవా సంస్థ సభ్యుల నేతృత్వంలో ఆదివారం సందిపూడి వెళ్లి సత్తిపండును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ గోదావరి జిల్లాలకు అన్నం పెట్టిన మహనీయుడు కాటన్ దొర అని అన్నారు. అటువంటి మహనీయుని విగ్రహం పెట్టాలని సత్తిపండు తల్లిదండ్రులు సంకల్పించడం ఒక గొప్ప విషయం అన్నారు. వాళ్ల మరణానంతరం నిరుపేద అయినప్పటికీ కాటన్ దొర విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సత్తిపండు చరిత్రలో మహోన్నతమైన వ్యక్తిగా నిలుస్తారని గిరజాల అభినందించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి శ్రీనివాసరావు, బాధ్యత సేవా సంస్థ సభ్యులు దొడ్డా బుజ్జి, పున్నమిరాజు వీర్రాజు, కొక్కిరాల వెంకటేశ్వరరావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు