ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంబరాల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్, నారా బ్రాహ్మణి, దేవాంశ్, బాలకృష్ణ సతీమణి వసుంధరతో పాటు ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలను భువనేశ్వరి, బ్రాహ్మణి పరిశీలించారు. సంబరాల్లో భాగంగా ఏర్పాటుచేసిన పోటీలను సీఎం, కుటుంబసభ్యులు తిలకించారు. అంతకుముందు ప్రజల నుంచి వినతిపత్రాలను సీఎం చంద్రబాబు స్వీకరించారు. నేడు నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మూడు రోజులపాటు స్వగ్రామంలోనే చంద్రబాబు ఉండనున్నారు.
నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న సీఎం చంద్రబాబు కుటుంబం
- Advertisement -
RELATED ARTICLES


