ఎంఈఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; చదువుతోపాటు క్రీడలు శరీర దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి అని మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను వారు నిర్వహించారు. అనంతరం గోపాల్ నాయక్ మాట్లాడుతూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది నిత్యజీవితంలో చాలా అవసరమని, శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిపారు. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో పాల్గొనాలని,, దానిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన వారందరికీ కూడా డివిజన్ స్థాయిలో గెలుపొందు వారిని అందరిని రాష్ట్రస్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీల్లో ప్రభుత్వ ప్రవేట్ పాఠశాల విద్యార్థులను రెండు భాగాలుగా పాల్గొనడం జరిగిందని తెలిపారు. మండల స్థాయిలో ఏడు విభాగాలలో అండర్ 14 అండర్ 17 బాలురు బాలికలు, పాల్గొనడం జరిగిందన్నారు. ముఖ్యంగా వాలీబాల్, కోకో, కబడి ,చెస్ ,యోగ, షటిల్, బ్యాట్మింటన్ మొదల విభాగాలలో పోటీలు జరిగినవని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ రామకృష్ణ, సుమన, మండల కోఆర్డినేటర్లు స్వప్న, సరళ, ఫిజికల్ డైరెక్టర్లు నాగేంద్రప్రసాద్, రఘునాథ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి ఉతికి సంతాపం తెలిపిన మండల విద్యాశాఖ అధికారులు.
పట్టణములోని రాజేంద్రనగర్ లో ఐదవ తరగతి చదువుతున్న ఇర్షాద్ ఈనెల 16వ తేదీ గురువారం కుటుంబంతో కలిసి పెనుగొండకు పోయి వచ్చేటప్పుడు ఆటోలో ప్రయాణిస్తూ ఉండగా, అనుకోని ప్రమాదం వల్ల ఎస్ .ఇర్షాద్ మృతి చెందాడు. ఈ సందర్భంగా ఎంఈఓ లు గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి వారి కుటుంబానికి వెళ్లి బాలుని మృతి పట్ల సంతాపం తెలిపారు. విద్యార్థికి ప్రభుత్వం తరఫున రావలసిన సౌకర్యాలను తప్పక కల్పిస్తామని తెలిపారు.


