విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈనెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నవదశ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ, శ్రీ గణపతి సచ్చిదానంద దత్త జాన బోధ సభా ట్రస్ట్ కమిటీ సభ్యులు మేటికలకులయప్ప, దత్త శివ, బిల్లే నాగప్ప ,సాగసురేష్, శంకర సంజీవులు, రంగా ,శీనా, గుద్దటి రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండవ రోజున రోజున ఆలయంలో విశ్వకేశన ఆరాధన ధ్వజారోహణము ఆరాధన నిత్య హోమాలు అర్చకులు సుదర్శన చార్యులు, నాగ నరసింహ సుదర్శన వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో నిర్వహించారు అని తెలిపారు. అదేవిధంగా ఉదయం పెద్దశేష వాహనం రాత్రి గరుడ వాహనములలో పట్టణ పురువీధులలో స్వామి వారు ఊరేగించారు. పెద్ద శేష వాహనమునకు ఉభయ దాతలుగా సీతారామయ్య జూనియర్ కాలేజ్ గరెస్పాండెంట్ సీతారామయ్య ,సతీమణి లక్ష్మీదేవి వ్యవహరించారు, తదుపరి గరుడ వాహనమునకు బయరగారి సుకుమారి బయనగారి నాగరాజు వ్యవహరించారు. ఉభయ దాతల పేరిటన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఘనంగా సత్కరించారు.తొలుత మూలవిరాట్ విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు భక్తాదుల ఆధ్వర్యంలో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తాదులు, దాతలు, ఆలయ అభివృద్ధి కమిటీ, ఎస్ డి హెచ్ ఎస్ వాలంటీర్లు, మహిళా మండలి తదితరులు పాల్గొన్నారు.
పెద్ద శేష గరుడ వాహనంలో దర్శనమిచ్చిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి
- Advertisement -
RELATED ARTICLES


