Saturday, May 17, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసెమిస్టర్ ఫలితాలలో విజయ దుందుభి మ్రోగించిన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల

సెమిస్టర్ ఫలితాలలో విజయ దుందుభి మ్రోగించిన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎల్. పి. సర్కిల్ లోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు యూనివర్సిటీ ప్రకటించిన 3వ సెమిస్టర్ ఫలితాలలో యూనివర్సిటీ స్థాయిలో టాప్ మార్కులుతో మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని ప్రిన్సిపాల్ మల్లికార్జున, కరెస్పాండెంట్ సాయి, డైరెక్టర్ జగదీష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిభ కనపరిచిన విద్యార్థినులు బిఎస్సి గ్రూపు నందు పి. సంతోషిణి 94.5 శాతము, పి. మమత 94 శాతము, పి. ధరణి 90 శాతము కాగా, బీకాం గ్రూపు నందు కె. విజయ దుర్గ 86.25 శాతము, సి. అనూష 86 శాతము, పి. మౌనిక 85.7 శాతము, బి బి ఏ గ్రూపు నందు ఎస్. యాస్మిన్ 85 శాతము, ఎం. కల్యాణి 75 శాతము, బి. స్నేహప్రియ74 శాతము రావడం జరిగిందన్నారు . వీరితో పాటు ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థినిని కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున, కరెస్పాండెంట్ సాయి,డైరెక్టర్ జగదీశ్, కళాశాల అధ్యాపకులు అభినందించారు. ఈ విజయానికి సహకరించిన అధ్యాపకులకు, తల్లి తండ్రులకు శుభాకాంక్షలు తెలియచేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు