Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిజయవంతముగా పాలిసెట్ కౌన్సిలింగ్ అవగాహన..

విజయవంతముగా పాలిసెట్ కౌన్సిలింగ్ అవగాహన..

- Advertisement -

ప్రిన్సిపాల్ సురేష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలి టెక్నిక్ ధర్మవరం నందు సోమవారం నిర్వహించబడిన పాలిసెట్ కౌన్సిలింగ్ అవగాహన కార్యక్రమం విజయవంతముగా నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమం నకు వంద మందికి పైగా ర్యాంకర్లు గల విద్యార్థులు, వారి తల్లితండ్రులు హాజరు కావడం జరిగిందన్నారు. మొత్తం మీద ఈ అవగాహన సదస్సు అందరికీ ఉపయోగం పడటం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి అవగాహన కార్యక్రమం కళాశాలలో నిర్వహించడం మాకెంతో ఉపయోగకరంగా ఉందని తల్లిదండ్రులు, విద్యార్థులు తెలిపారు. తదుపరి ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌన్సిలింగ్ ప్రక్రియను వివరించడం జరిగిందన్నారు. అనంతరం ర్యాంకర్ల సందేహాలను నివృత్తితో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో శాఖఆధిపతులు హేమాంజ, హరిబాబు, బాల జోషి ,అధ్యాపకులు రాజేష్, మల్లికార్జున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు