సిపిఐ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్
విశాలాంద్ర ధర్మవరం/ ముదిగుబ్బ; రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఇచ్చే పరిహారాన్ని మూడు విడతలుగా కాకుండా మొత్తం పరిహారాన్ని ఒకే విడతలో ఇవ్వాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాసినేని ప్రభాకర తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా పీఎం కిసాన్ తో కలిపి ఏడాదికి 20 వేల రూపాయలు రైతులకు అందించడంలో భాగంగా మొదటి విడతగా ఈనెల 20వ తేదీ 7000 రూపాయలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న విషయం తెలిసిందే నని , గత వైసీపీ ప్రభుత్వం కూడా రైతు భరోసా పథకం ద్వారా ఇదే తరహాలో ఏడాదికి మూడుసార్లు పరిహారం అందించడం వలన రైతులకు ఆశించినంతగా ఆర్థికంగా వెసులుబాటు కలగలేదని వారు విచారం చేశారు. కనుక ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా గత వైసిపి ప్రభుత్వం మాదిరిగా పరిహారాన్ని విడతల వారీగా కాకుండా మొత్తం పరిహారాన్ని ఒకేసారి పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కావున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఈ విషయమై పునరాలోచించి, అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదిలో మూడు విడతలుగా ఇవ్వాలనుకున్న ఈపరిహారాన్ని ఒకేసారి
ఈ నెలలోనే రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతన్నలకు తమ పంటల సాగులో భాగంగా ఆర్థికంగా చేయూత నివ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రైతు సంఘం మండల నాయకులు అన్నమనేని వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
అన్నదాత సుఖీభవ పథకం పరిహారాన్ని ఒకే విడతలోనే మంజూరు చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


