Homeజాతీయంబాబర్ పేరున్న మసీదులపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

బాబర్ పేరున్న మసీదులపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

- Advertisement -

మొఘల్‌ సామ్రాజ్యానికి పునాది వేసిన తొలి చక్రవర్తి బాబర్‌ పేరును మసీదులకు పెట్టడాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
మసీదులకు బాబర్‌ పేరు పెట్టడం లేదా వాటిని బాబ్రీ మసీదుగా వ్యవహరించడాన్ని చట్టపరంగా ఆపాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి, దానిని కొట్టివేసింది.

కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలుగా ప్రతివాదులు
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దేవ్‌కీ నందన్‌ పాండే ఈ పిటిషన్‌ను సమర్పించారు. తన వాదనలో బాబర్‌ను దురాక్రమణదారుడుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రతివాదులుగా చేర్చిన విషయం గమనార్హం. ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఒక మసీదుకు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా, ఆ మసీదుకు బాబర్‌ పేరు పెట్టడం రాజ్యాంగ విరుద్ధం కాదని బహిష్కృత టీఎంసీ ఎమ్మెల్యే హుమయూన్‌ కబీర్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు