Thursday, January 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికళాశాల మైదానం లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

కళాశాల మైదానం లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

ధర్మవరం మైదానాన్ని శుభ్రపరిచిన బిజెపి నేతలు, కార్యకర్తలు, మున్సిపాలిటీ అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణం లోని కళాశాల మైదానం లో సంక్రాంతి పండుగ సందర్బంగా వివిధ రకాల కార్యక్రమాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా మైదానంలో పేరుకుపోయిన చెత్త ను మంత్రివర్యులు సత్యకుమార్ ఆదేశాల మేరకు బిజెపి నాయకులు, కార్యకర్తలు మున్సిపాలిటీ సిబ్బంది తో కలిసి చెత్తను తొలగించి మైదానం ను శుభ్రపరిచారు.మన పరిసరాలను మనమే శుబ్రపరుచుకోవాలని, స్వచ్ఛ ధర్మవరం కు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. మైదానం ను శుభ్రపరిచినందుకు క్రీడాకారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రెండు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొన్న ప్రజల కు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన మిన్సిపాలిటీ సిబ్బందికి,పోలీస్ సిబ్బందికి,ఐ.సి.డి.యస్ సిబ్బందికి అగ్రికల్చర్ సిబ్బందికి మంత్రి తరుపున బిజెపి నాయకులు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ గారు,బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి,శ్యామరావు, పట్టణ అధ్యక్షులు జింకా చంద్రశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబిలేసు,, కొండమీద రాయుడు,నాగభూషణం, జూటూరు వెంకటేష్,మంజునాథ్, మహేష్, నబిరసూల్,సోమ్లా నాయక్, మిర్యాల అంజి,రాధమ్మ, శారదమ్మ,ఈశ్వర్ నాయక్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు