విశాలాంధ్ర- తనకల్లు ; ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలు చేస్తూ పరిష్కారం దిశగా దూసుకుపోతున్న ఎస్టియు లోకి పలువురు ఉపాధ్యాయులు ఇతర సంఘాల నుండి చేరారు.
రవీంద్ర నాయక్ ,హరి నాయక్ ,కుల్లాయి నాయక్, అనిల్ నాయక్ అధ్యక్షుడు హరి ప్రసాద్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక కమిటీ వెంకటేశ్వర్లు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు లక్ష్మీప్రసాద్ ల ఆధ్వర్యంలో ఎస్. టి. యు. లోకి సాదరంగా ఆహ్వానించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై అను పెరగని పోరాటం చేస్తున్న STU సంఘంలో చేరడం గర్వకారణంగా ఉందన్నారు. సంఘ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ సేవే శ్వాస – సేవే ధ్యాసగా పనిచేసి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్, శివకుమార్, మహేశ్వర, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఎస్.టి.యు.లోకి ఉపాధ్యాయులు చేరిక
- Advertisement -
RELATED ARTICLES


