Homeజిల్లాలుఅనంతపురంఅధిక వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు అరికట్టాలి

అధిక వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు అరికట్టాలి

- Advertisement -

సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్

విశాలాంధ్ర -అనంతపురం : అధిక వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలు అరికట్టాలని సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ సిపిఐ నగర సమితి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు మాట్లాడుతూ… అనంతపురం 1వ పట్టణ స్టేషన్ పరిధిలోని బంగారు షాపులో పనిచేస్తున్న మైనార్టీ యువకుడిపై వడ్డీ దారులు దాడి చేయడం చట్టపరమైన చర్యలు లేకపోవడం.ఆటోడ్రైవర్ బాలకృష్ణ పై దాడి చేసి, అతని ఇంటి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి, అతని జీవనాధారమైన ఆటోను తీసుకుపోతానంటూ బెదిరించడంపై స్పందన లో ఫిర్యాదు చేసినప్పటికీ ఆత్మ హత్యకు పాల్పడ్డా కూడా పోలీస్ చర్యలు తీసుకోలేదన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగి రవికుమార్ 50 వేలు జీతం, రూ.35 వేలు రుణం మీద 1.2 లక్షల రూపాయలు వడ్డీ చెల్లించిన తర్వాత కూడా అధిక వడ్డీదారుల వేధింపులు తాళలేక బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ఘటనలు నగరంలో పెరిగిపోతున్న అధిక వడ్డీ దందాలు ఎంత భయంకర స్థాయికి చేరాయని స్పష్టంగా చూపిస్తున్నా,పోలీస్ శాఖ మాత్రం ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికీ నగరంలో నిర్ధయంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న అధిక వడ్డీ దందాలపై సిపిఐ నగర సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. మితిమీరిన వడ్డీ శాతాలతో పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆర్థికంగా దోచుకుంటూ, వారి జీవితాలను నాశనం చేస్తున్న ఈ అక్రమ వ్యాపారాలను నియంత్రించడంలో పాలక వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. అధిక వడ్డీ దందాలపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలన్నారు. అక్రమ వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. అనంతరం డి.ఎస్.పి శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య బావిగడ్డ రమణ, ఎ ఐ వై ఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ ఏపీ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి పద్మావతమ్మ అధ్యక్షులు పార్వతి ప్రసాద్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుల్లాయి స్వామి సిపిఐ నగర సహాయ కార్యదర్శి వి. కృష్ణుడు అల్లిపీరా ఎల్లుట్ల నారాయణస్వామి, బంగారు భాష,రాజు ప్రసాద్ యశోదమ్మ ఏఐవైఎఫ్ నగర అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ ,మంజునాథ్, ఆనంద్, సీపీఐ,విద్యార్థి యువజన మహిళా సమైక్య నాయకులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు