Homeజిల్లాలుఅనంతపురంమండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం

మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం

- Advertisement -

విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత శ్రీకారం చుట్టారని టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు తెలిపారు. వారు మాట్లాడుతూ రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామం నుండి 44వ జాతీయ రహదారి వరకు10 కిలోమీటర్ల మేర గుంతలు పడి ప్రజా రవాణా వ్యవస్థకు అనేక ఇబ్బందులు ఎదురయ్యేవన్నారు. తారు రోడ్డు వేయించాలని ఎమ్మెల్యే పరిటాల సునీతకు విన్నవించగా సంబంధిత శాఖ ద్వారా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రూ.సుమారు 3 కోట్లు మంజూరు చేయించారన్నారు. ప్రస్తుతం తారు నిర్మాణం పూర్తయి రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలను తొలగించి తారు రోడ్డును ప్రారంభించారు. సందర్భంగా బుక్కు చర్ల గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బుక్కచెర్ల సొసైటీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పెద్ద ఓబిలేసు, ఫీల్డ్ అసిస్టెంట్ ఓబులేసు, క్లస్టర్ ఇంచార్జి సోమర నారాయణస్వామి, కక్కలపల్లి శీనా, చెడిపోతుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు