Homeజిల్లాలుప్రకాశంతీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలి

తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలి

- Advertisement -

-వెలుగు ఏపీఎం నరేంద్రకుమార్

విశాలాంధ్ర నాగులుప్పలపాడు : పొదుపు మహిళలు తీసుకున్న రుణాన్ని సక్రమంగా తిరిగి చల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని వెలుగు ఏపీఎం నరేంద్రకుమార్ సూచించారు. శుక్రవారం ఈ-నారీ కార్యక్రమంతో పాటు సీఆర్పీలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా బ్యాకుల్లో రుణ పరపతి పెరుగుతుందన్నారు. అలాగే మన డబ్బులు, మన లెక్కలు యాప్ ఉపయోగాన్ని వివరించారు. యాప్ వినియోగం ద్వారా అకౌట్ల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు