Saturday, March 7, 2026
Homeజిల్లాలునెల్లూరులేబర్ కోడ్స్ వద్దు..కార్మిక చట్టాలు ముద్దు..

లేబర్ కోడ్స్ వద్దు..కార్మిక చట్టాలు ముద్దు..

- Advertisement -

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా కార్యదర్శి—- అరిగెల సాయి

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: కార్మికులు పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం దుర్మార్గమనిసిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి అన్నారు. బుధవారం నెల్లూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూనెల12వ తేది పది వామపక్ష పార్టీల కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అందుకు భారత కమ్యూనిస్టు పార్టీ నెల్లూరు జిల్లా సమితి తమ పూర్తి మద్దతును తెలియజేస్తుందని అదేవిధంగా సిపిఐ అనుబంధంగా ఉండే రైతు సంఘం కార్మిక సంఘాల తో పాటు మహిళా సంఘం విద్యార్థి యువజన వ్యవసాయ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం పోరాటం చేసి సాధించుకున్న కా ర్మిక చట్టాలను (8 గంటల పనివిధానం, కనీస వేతనం తదితర అంశాలు) రద్దు చేసి కార్పోరేట్ శక్తులకు లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోని 12 గంటల పనివిధానం అమలు చేయడం, కనీస వేతనం అమలు చేయక పోవడం, ఉద్యోగ భద్రత లేకుండా చేయడం, గ్రాడ్యూటీ తొలగించడం, ప్రాణాలకు భద్రత లేకుండా చేయడం దారుణమన్నారు.వీటన్నింటికీ వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కార్మిక, కర్షక,ఉద్యోగ, పెన్షనర్లు సమ్మె చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అప్పణంగా, కారు చౌకగా అప్పగించడం, మతోన్మాద చర్యలకు కేంద్రంలో బిజెపి పాల్పొడు తుందన్నారు. అందుకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తున్నాయన్నారు. క్రిష్ణపట్నం పోర్టులో కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. కనీన వేతన చట్టం అమలు కావడం లేదన్నారు. కంటైనర్ టర్మినల్ను ఆదాని తన సొంత పోర్టుకు తరలించుకొని పోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, చివరకు జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు ఈ అంశంపై ప్రస్తావించకపోవడం దుర్మార్గమన్నారు. కంటైనర్ కృష్ణపట్నం పోర్టు వద్ద లేకపోయినప్పటికీ వేలాది ఎకరా ల భూమిని ఆదానికి అప్పగించడందుర్మార్గమన్నారు. అంతే కాకుండా కార్మికులు ఎవరైనా తమ విధులకు భద్రత కల్పించాలని యాజమాన్యాలను కోరడం సైతం కోల్పోతారన్నారు. సామాజిక భద్రతలో భాగమైన ఈఎస్ఐ, పిఎఫ్, మహిళలకు ప్రసూతి సెలవులు అన్ని యాజామాన్యం దయాదాక్ష్మణ్యలమీద ఆదారపడి జీవించాల్సి ఉంటుందన్నారు. హమాలీ సంఘాలకు ఎటువంటి హక్కులు లేకుండా చేశారని, రవాణా రంగం, భవన నిర్మాణ కార్మికులకు, జర్నలిస్టుల కు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టిపట్టనట్లు వ్యవహిరిస్తున్నారన్నారు.ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం
చూపించాలని కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని గుర్తించి వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిసి యాజమాన్యందయాదాక్షణ్యలమీద బ్రతికే విధ oగా చట్టాలను తయారు చేసిందన్నారు. కనుకఈ సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని ప్రతి ఒక్కరూ రోడ్లుమీదకు వచ్చి ప్రభుత్వ విధానాలకు నిరసన తెలియజేయా లన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పి జిల్లాని ఖాన్ మాట్లాడుతూ అఖిల భారత కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేది న దేశ వ్యాప్త సార్వత్రిక నమ్మెకు పిలుపు నిచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోడి అవలంభి స్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ చైతన్య పరుస్తుందన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ గాతీసుకురావ డందుర్మార్గమైనచర్యలన్నారు. కార్మికుల హక్కుల కోసం, వాటి పరిరక్షణ కోసం, కార్మిక చట్టాలనుకాపాడుకొనేందుకు, హమాలీ, రవాణా రంగం కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. స్కీం వర్కర్లను, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానం లో పనిచేస్తున్న వారందరినీ పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26వేల అందజేయాలని కోరుతూ నిర్వహిస్తున ఈ సమ్మెలో యావత్తు కార్మికవర్గం అంతా పాల్గొని నమ్మెను జయప్రదం చేయాలన్నారు 12న ఉదయం 10 గంటలకు ఏబీఎన్ కాంపౌండ్ వద్ద నుండి జరుగు కార్మిక ప్రదర్శనలో అధిక సంఖ్యలో ప్రజలు కార్మికులు కర్షకులు మేధావులు ఉద్యోగులు పాల్గొనిజయప్రదం చేయాలన్నారు కార్మిక సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టిపట్టనట్లు వ్యవహిరిస్తున్నారన్నారు.ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాలని కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని గుర్తించి వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిసి యాజమాన్యందయాదాక్షణ్యలమీద బ్రతికే విధ oగా చట్టాలను తయారు చేసిందన్నారు. ఈ సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని ప్రతి ఒక్కరూ రోడ్లుమీదకు వచ్చి ప్రభుత్వ విధానాలకు నిరసన తెలియజేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వము కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు తమ మద్దతు తెలియజేస్తూ కార్మిక వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నిస్తోందని జిలాని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నెల్లూరు నగర కార్యదర్శి సోఫియా తదితరులుపాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు