రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదానికి దారితీసిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వేగంగా దూసుకొచ్చిన కారు స్కూటీని ఢీకొట్టడంతో ఓ మెడికల్ విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.
తలపై నుంచి కారు వెళ్లడంతో వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు వైద్యులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను ప్రకాష్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.ఈ నెల 3న రాజమహేంద్రవరంలోని ప్రసాదిత్యా మాల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మాల్ నుంచి స్కూటీపై బయటకు వస్తున్న వైద్యవిద్యార్థిని, ఆమెతో ఉన్న మరో వ్యక్తి ఏవీ అప్పారావు రోడ్డులోకి రాగానే వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన అనంతరం కారు ఆమె తలపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.
నిందితులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కారు నడిపి స్కూటీని ఢీకొట్టారు.వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, ఆమెను వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. కారు నడిపిన ఇద్దరినీ నామవరానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డీఎస్పీ ఎ. సుభాష్ వివరాలు వెల్లడించారు.
నిందితులు ఉద్దేశపూర్వకంగా అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి స్కూటీని ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, మెడికల్ విద్యార్థినికి తలకు తీవ్రమైన గాయాలయ్యాయని తెలిపారు.ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.దర్యాప్తులో నిందితులు మద్యం సేవించి ప్రసాదిత్యా మాల్‌కు సినిమా చూసేందుకు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.
మాల్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఘటనపై కూడా మరో కేసు నమోదు
మద్యం సేవించిన విషయం గుర్తించిన మాల్ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదని తెలిపారు.దీంతో ఆగ్రహానికి గురైన వారు బయటకు వెళ్లే సమయంలో గేటు వద్ద స్కూటీని ఢీకొట్టి, అక్కడి నుంచి వేగంగా కారులో పరారయ్యారని వివరించారు. ఈ కేసులో సురావరపు దస్వంత్‌ను ఎ-1గా, ఆండ్రూ జోసఫ్ అడ్వర్డ్స్‌ను ఎ-2గా చేర్చి కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మాల్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఘటనపై కూడా మరో కేసు నమోదు చేశామని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించామని, ఈ వ్యవహారంలో పోలీసులు ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించలేదని స్పష్టం చేశారు.


