Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇక సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు ప్రారంభం

ఇక సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు ప్రారంభం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం బదిలీల పర్వాన్ని ప్రారంభించింది. ఈనెల 30వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆదేశాలు ఇప్పటికే కలెక్టర్లకు అందాయి. సచివాలయంలో ఐదు సంవత్సరాలు పూర్తి అయిన ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీ వేస్తారు. అంతేకాకుండా ప్రభుత్వం ఉద్యోగుల హేత భద్రీకరణతో పాటు బదిలీల ప్రక్రియ పూర్తిచేసేలా అనేక మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా క్లస్టర్ను పరిగణలోకి తీసుకోవడం, గ్రామాల్లో రెండు సచివాలయాలను ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేయడం, జనాభా నిష్పత్తిని బట్టి ఆరు మంది లేదా ఎనిమిది మంది సిబ్బంది ఉండేలా కసరత్తు ప్రారంభమైందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. సచివాలయాలలో సర్వేయర్ లేని సచివాలయులకు నూతన పోస్టింగ్ ఉండదు. సచివాలయ ఉద్యోగులు వైయస్సార్ హయాంలో నిరుద్యోగులుగా ఉండడంతో విదిలేని పరిస్థితిలో సచివాలయ ఉద్యోగులుగా చేరడం జరిగింది. కానీ ఈ ఉద్యోగంతో సంతూర్ లోనే ఉండొచ్చు అన్న ఆశలు ఎన్డీఏ ప్రభుత్వంతో ఆడి ఆశలు అయ్యాయి. ఇక చేసేది లేక బదిలీకి సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. అనుకున్న ప్రకారం, అవకాశం ఉన్నంతవరకు బదిలీ వేస్తే వెళ్లడానికి సిద్ధమంటున్నారు సచివాలయ ఉద్యోగస్తులు. మరి కొంతమంది 5 సంవత్సరాలలో తమ సొంత ప్రాంతాలకు కాకుండా వేరే చోట వీధుల్లో ఉన్నారు. అటువంటివారు ఈ ఎన్ డి ఏ ప్రభుత్వం ఇచ్చిన బదిలీ వార్త శుభంగా భావించి బదిలీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో భాగంగానే దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు కూడా రావడంతో దివ్యాంగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ బదిలీలు మున్సిపాలిటీ వారిగా, జిల్లాల వారీగా చేయాల్సి ఉంది. ఏది ఏమైనా ఈనెల 30వ తేదీ సచివాలయ లు కుదింపు కావడం, బదిలీలు కావడం స్పష్టం అని తెలుస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు