- Advertisement -
మరో రెండు రోజుల్లో బాధ్యతల స్వీకరణ
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా వెంకట రమణయ్య ను ప్రభుత్వం ఈనెల 15వ తేదీన నియమించడం జరిగిందని పురపాలక అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు అందాయని తెలిపారు. ప్రస్తుతం వెంకట రమణయ్య కర్నూలు జిల్లా దోమ పిడిగా విధులు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో వీరు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత మూడు నెలలుగా ఇంచార్జ్ కమిషనర్ గా సాయి కృష్ణ కొనసాగుతున్నారు. ఎట్టకేలకు మూడు నెలలు తర్వాత శాశ్వత మున్సిపల్ కమిషనర్ రాకతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


