:సెర్ప్ సంస్థ నుంచి ఆర్థిక సాయం
విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండల మహిళా సమాఖ్య పరిధిలో వసతి స్థాయిలో సేవలందిస్తున్న విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ కొయ్యాన జగదాంబ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విధి నిర్వహణలో నిబద్ధత, గ్రామ మహిళా సంఘాల అభివృద్ధికి అందించిన సేవలతో మంచి పేరును సంపాదించిన జగదాంబ అనూహ్యంగా మరణించడం స్థానిక సమాఖ్య, గ్రామస్తుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.దుర్ఘటన విషయం తెలుసుకున్న మండల మహిళా సమాఖ్య ప్రకాశం వ్యక్తం చేస్తూ, ఆమె కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. దహన సంస్కారాల కోసం సెర్ప్ సంస్థ తరఫున రూ.25,000 ఆర్థిక సహాయాన్ని సమాఖ్య అధ్యక్షులు, సిబ్బంది కలిసి ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు జగదాంబ సేవలను స్మరించుకుంటూ, ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్థానిక మహిళా సంఘాలు, సహాయ సమూహాల సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో విచారాన్ని వ్యక్తం చేస్తూ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు చేరుకున్నారు. గ్రామంలో అంత్యక్రియలు శోకసంద్రంలో జరిగాయి.


