… పిఎసిఎస్ అధ్యక్షులు లీలా భాస్కర్
విశాలాంధ్ర – నిడదవోలు :
రాష్ట్ర ప్రభుత్వం సొసైటీ ద్వారా అమలు చేసే రైతు సంక్షేమ పథకాలను రైతులకు సకాలంలో అందజేసి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని శంకరాపురం సొసైటీ నూతన అధ్యక్షులు పోల్నాటి లీల భాస్కర్ అన్నారు. నిడదవోలు మండలం రావిమెట్ల లోని ది. శంకరాపురం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షులుగా పోల్నాటి లీలభాస్కర్, పాలకవర్గ సభ్యులుగా పడాల బ్రహ్మాజీ, గిద్దా శ్రీధర్ పదవి బాధ్యతల ప్రమాణ స్వీకరణ నిర్వహించారు.ఈ సందర్భంగా లీలా భాస్కర్ మాట్లాడుతూ శంకరపురం సొసైటీ పరిధిలోని రైతులకు సహాయ సహకారాలు అందించి రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరవలి డిస్ట్రిబ్యూటీ కమిటీ ప్రెసిడెంట్ బూరుగుపల్లి శ్రీనివాసరావు. మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలగన సూర్యారావు ,జనసేన మండల పార్టీ అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి నాయకులు పాల్గోని శుభాకాంక్షలు తెలియజేశారు.


