Homeజిల్లాలుతూర్పు గోదావరివ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై వెబినార్

వ్యవసాయం, గ్రామీణ పరివర్తన అంశంపై వెబినార్

- Advertisement -

విశాలాంధ్ర – భీమవరం : భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్చి 6న వర్చువల్ విధానంలో “వ్యవసాయం గ్రామీణ పరివర్తన” అంశంపై వెబినార్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కార్యక్రమాల అమలు రోడ్‌మ్యాప్‌పై చర్చించేందుకు భారత ప్రభుత్వ వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మార్చి 06, 2026న ఉదయం 10:00 గంటల నుండి వర్చువల్ విధానంలో “వ్యవసాయం, గ్రామీణ పరివర్తన” అంశంపై బడ్జెట్ అనంతర వెబినార్ నిర్వహించనుంది. ఈ వెబినార్ ప్రారంభ సెషన్‌లో గౌరవ ప్రధానమంత్రి ప్రసంగించినట్లు తెలిపారు. అనంతరం వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రత్యేక సెషన్‌లు నిర్వహించబడతాయన్నారు. ముఖ్యంగా ఎఐ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యవసాయం కోసం, వ్యవసాయ – అటవీ వ్యవస్థల ప్రోత్సాహం, ఉద్యానవన అభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధి బలోపేతం వంటి అంశాలపై చర్చలు ఉంటాయన్నారు. మొత్తం ఎనిమిది సెషన్‌లతో వెబినార్ కొనసాగతుందని, మొదటి సెషన్ వ్యవసాయ రంగంపై సమగ్ర దృష్టి సాధించేలా చర్చ ఉంటుందన్నారు. మిగతా సెషన్స్ లో వ్యవసాయ రంగంలోని ప్రత్యేక విభాగాలను కవర్ చేయడం జరుగుతుందన్నారు.ఉదయం 10:00 గంటల నుండి ప్రధానమంత్రి ప్రసంగం అన్ని సెషన్‌ల లింక్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని తెలిపారు. ఈ వెబినార్‌ లో ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు, సహకార సభ్యులు, రైతులు, ఇతర వాటాదారులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అవసరమైన చోట వెబినార్‌ను వీక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు