Homeజిల్లాలుతూర్పు గోదావరిప్రతిష్ఠాత్మకంగా జనగణన

ప్రతిష్ఠాత్మకంగా జనగణన

- Advertisement -

శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి

విశాలాంధ్ర – భీమవరం : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న జనగణన 2027ను జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు.
భీమవరం కలెక్టరేట్ పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మొదటి దశ “గృహాల జాబితా మరియు గృహ వసతుల గణన” శిక్షణా కార్యక్రమం మూడవ రోజు ఆయన పాల్గొని శిక్షణ తీరును పరిశీలించారు. అధికారులు వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు.
జనగణన–2027 దేశంలో నిర్వహించబడనున్న మొదటి డిజిటల్ జనగణనగా ఉండనుందని తెలిపారు. గణకులు స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యేక మొబైల్ యాప్‌ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తారని, వెబ్ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. మూడు రోజుల శిక్షణలో జనగణన నిర్వహణ విధానం, కాలపట్టిక, అమలు వ్యూహం, బ్లాక్‌ల ఏర్పాటు, గ్రామ సరిహద్దుల నిర్ణయం, గ్రామ–పట్టణ రిజిస్టర్లు, లేఅవుట్ మ్యాప్‌లు మరియు డిస్ట్రిక్ట్ సెంసస్ హ్యాండ్‌బుక్ తయారీపై అధికారులకు మార్గదర్శకత్వం అందించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ బి.రమాదేవి, సెన్సస్ అధికారులు సోను యాదవ్, తరుణ్ హట్కర్, దేవేంద్ర నాయక్, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు