Wednesday, July 2, 2025
Homeఆంధ్రప్రదేశ్హత్యాయత్నం కేసులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట

హత్యాయత్నం కేసులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట

ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
దర్యాప్తుకు సహకరించాలని ఆదేశం
సాక్షులను బెదిరించకూడదన్న ధర్మాసనం

వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసులో సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు పలు షరతులు కూడా విధించింది. దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరుకావాలని, దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని, సాక్షులను బెదిరించడం, ఆధారాలను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదని ఆదేశించింది. జస్టిస్ పార్ధివాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రూ. 5 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారని… స్థల యజమానిని హత్య చేసేందుకు సుపారీ ఇచ్చాడనే ఆరోపణలతో గౌతమ్ రెడ్డిపై కేసు నమోదయింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు