Homeసాహిత్యంఒరేయ్ పశువా…!

ఒరేయ్ పశువా…!

- Advertisement -

మాతృగర్భ గుడిలో
తొమ్మిది నెలలు మోసి
భూమి మీదకు పంపింది
యుద్ధ వీధిలో ఒరిగిపొమ్మని కాదు
రక్తమాంసాలను చనుబాలుగా చేసి
శక్తినిచ్చింది
మారణాయుధం చేతబూని
మారణహోమం సాగించమని కాదు
అధికారదాహపు ఫిరంగిలో
సైనికుని దూర్చేసి
దేశభక్తి నిప్ప్పుతో ఫిరంగి పేల్చే
దురహంకారపు మదాన్ని ఏమనాలి
నీ ర్పు్యాకాంక్షకు
నీ ఆధిపత్య దాహానికి
ఎన్ని లక్షల లీటర్ల నెత్తురు కావాలి
ఎన్నేసి శవాలగుట్టలు పోగవ్వాలి
నీకు పుట్టుకనిచ్చిన
అమ్మను ఓ మాట అడిగిచూడు
తన కళ్లముందరే…నువ్వు శవమైతే
ఆ తల్లి హృదయస్పందన ఎలా ఉంటుందని
ఇప్ప్పుడు నువ్వు పేరుస్తున్న
ఒక్కో శవం వెనుక
ఒక్కో గర్భాలయ శోకం ఉంది
తెగిపడిన ప్రతి తల వెనుక
ఎవరూ పూడ్చలేని దుఃఖమూ ఉంది
మొండెం నుంచి వేరైన ఒక్క తలను కూడా
అతికించలేని రాక్షసుడవైన నీకు
తల తెంపే హక్కెవడిచ్చాడు
ర్పు్యాకాంక్షతో
ఇంద్రియ నిగ్రహం కోల్పోయిన నీకు
విధివంచితుల ఆర్తనాదాలు వినిపించవులే
ఒక్కసారి…
పగ పగతో చల్లారదు
ప్రేమతోనే వైరం నశిస్తుందని
చిన్నప్ప్పుడు వల్లెవేసిన పాఠం గుర్తుతెచ్చుకో…
పచ్చని చెట్లు చిగురించే పుడమితల్లి మీద
గడ్డకట్టిన రక్తపు చారల గుర్తులు
చరిత్రలో ఏమి చెబుతున్నాయో
గుర్తు తెచ్చుకో గుర్తుచేసుకో
ఆరడుగుల గోతిలోకి
నువ్వెళ్లే క్షణాల్ని
ఒక్కసారి స్మరించుకో
గోలి మధు, 9989186883

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు