Homeతెలంగాణజర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే ఆందోళన

జర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే ఆందోళన

- Advertisement -

టీయూడబ్ల్యూజే హెచ్చరిక

విశాలాంధ్ర- హైదరాబాద్‌: గత ప్రభుత్వం మాదిరిగా జర్నలిస్టుల సమస్యలు విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట తప్పదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూ డబ్ల్యూజే) ప్రభుత్వాన్ని హెచ్చరించింది. శంకర్‌ పల్లి మండలం పొద్దటూరు ప్రగతి రిసార్ట్స్‌ లో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్‌ అలీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో, జర్నలిస్టుల ప్రధాన సమస్యలు… వాటి పరిష్కారంపై జరుగుతున్న జాప్యంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించక పోవడం విచారకరమని సమావేశం అభిప్రాయ పడిరది. గత ప్రభుత్వం ఇలాంటి వైఖరినే అనుసరిస్తే గల్లీ నుంచి దిల్లీ వరకు ఉద్యమాలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేసింది. ఇంటి స్థలాలు, ఆరోగ్య పథకం, అక్రిడిటేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను వీలైనంత తొందరలో చేపట్టాలని ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేసింది. యూనియన్‌ నియమించిన ఆయా సబ్‌ కమిటీల సమావేశాలను త్వరలో నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఇటీవల జరిగిన హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గ ఎన్నికల్లో ఫ్రెండ్స్‌ ప్యానెల్‌కు మద్దతు పలికి, ప్యానెల్‌ గెలుపు కోసం శ్రమించిన విరాహత్‌ అలీతో పాటు ఇతర నాయకు లను కార్యవర్గం అభినందించింది. ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి సమావేశం శుభాకాంక్షలు తెలిపింది. యూనియన్‌ చేపట్టిన వివిధ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ నివేదిక సమర్పించారు. ఇటీవలి కాలంలో యూనియన్‌ (ఐజేయు) జాతీయ ప్లీనరీని విజయవంతం చేసేందుకు సన్నాహాలు ప్రారంభమైనట్లు శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అయితే ఈ ప్లీనరీ సందర్భంలో జనవరి మాసంలో రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ కేంద్రాల్లో సదస్సులు నిర్వహించేందుకు సమావేశం నిర్ణయించిందన్నారు. ఐజేయు జాతీయ మాజీ అధ్యక్షులు, స్టీరింగ్‌ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్‌, ఎం.ఏ. మాజీద్‌, జాతీయ కార్యదర్శి వై. నరేందర్‌ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. సంపత్‌ కుమార్‌, గాడిపల్లి మధు గౌడ్‌, కార్యదర్శులు కొంపల్లి శ్రీకాంత్‌ రెడ్డి, జి. మధు గౌడ్‌, గుడుపల్లి శ్రీనివాస్‌, కోశాధికారి మోతె వెంకట్‌ రెడ్డి, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యూసుఫ్‌ బాబు, అశోక్‌ లతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 30 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు