Homeరాహుల్‌ వ్యాఖ్యలు సరైనవే: ఇండియా

రాహుల్‌ వ్యాఖ్యలు సరైనవే: ఇండియా

- Advertisement -

న్యూదిల్లీ: భారత్‌ జోడో యాత్ర సమయంలో సైన్యంపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీని సుప్రీంకోర్టు మందలించడాన్ని ఇండియా ఐక్య సంఘటన తప్పుపట్టింది. రాహుల్‌పై సుప్రీం కోర్టు జడ్జిల వ్యాఖ్యలు నిరాధారమైనవని పేర్కొంది. రాహుల్‌ వ్యాఖ్యలు సరైనవేనంటూ సమర్థించింది. జాతీయ అంశాలను ప్రశ్నించే బాధ్యత రాజకీయ పార్టీలకు ఉందని వెల్లడిరచింది. ‘ఇండియా’ భాగస్వామ్య పార్టీల సభాపక్ష నేతలు మంగళవారం భేటీ అయ్యారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం అనవరసమైన వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడ్డారు. దీనివల్ల పార్టీల ప్రజాస్వామిక హక్కులపై ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా న్యాయస్థానం అసాధారణ వ్యాఖ్యలు చేసినట్లు ‘ఇండియా’ నాయకులు అంగీకరించినట్లు కాంగ్రెస్‌ ఓ ప్రకటన చేసింది. జాతీయ సమస్యలపై ప్రశ్నించే బాధ్యత రాజకీయ పార్టీలకు… మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేతలకు ఉంటుందని పేర్కొంది. సరిహద్దులు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు దానిని నిలదీయడం, జవాబుదారీతనాన్ని ప్రశ్నించడం ప్రతి పౌరుడి నైతిక కర్తవ్యమని వెల్లడిరచింది. అదే సమయంలో బీహార్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్‌ చేపట్టే చర్యలకు వ్యతిరేకంగా తమ ఆందోళనను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నదీ నాయకులు చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు