Homeజిల్లాలుగుంటూరుసంక్షేమ బోర్డు నిధులను వాడుకోవటం సిగ్గు చేటు : పుప్పాల సత్యనారాయణ

సంక్షేమ బోర్డు నిధులను వాడుకోవటం సిగ్గు చేటు : పుప్పాల సత్యనారాయణ

- Advertisement -

విశాలాంధ్ర- గుంటూరు సిటీ: సంక్షేమ బోర్డు నిధులను ప్రసార ఆర్భాటానికి వాడుకోవటం సిగ్గు చేటు అని రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ) అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ (బుజ్జి) అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దీంతో కార్మికుల ఆగ్రహానికి గురై ఇంటికి సాగనపటం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అధికారం చేపట్టి 22 నెలలు నడుస్తున్నప్పటికీ సంక్షేమ బోర్డు ప్రారంభించకపోవడం వలన కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం రూ.20 కోట్లు హెచ్చించి ఆటోలపై, ఆర్టీసీ బస్సులపై బస్‌ షెల్టర్ల వద్ద వారి వారి బొమ్మలతో ఫ్లెక్సీ చేయించుకొని ఉద్దరిస్తామని చెప్పటం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల 46వేల క్లెయిమ్స్‌ పెండిరగ్‌ ఉన్నాయని వాటికి రూ.110 కోట్ల నిధులు ఖర్చుపెడితే సరిపోతాయన్నారు. ఈ డబ్బులు ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించాల్సిన అవసరం లేదని కార్మికులు చెమట చిందించి తద్వారా వచ్చే సెస్‌ డబ్బులు వేలాది కోట్ల రూపాయలు ఖజానాలో ఉన్నాయని, వెంటనే సంక్షేమ బోర్డును ప్రారంభించి పెండిరగ్‌లో ఉన్న క్లైములకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి మేడా హనుమంతరావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు పెండిరగ్లో ఉన్న క్లైములకు నిధులు మంజూరు చేయకుండా స్కిల్‌ డెవలప్మెంట్‌ పేరుతో 70 కోట్లు నిధులు హెచ్చిస్తూన్నామని ప్రభుత్వం చెప్పుకుంటుందని, ఖర్చు పెట్టే డబ్బులు ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు పెట్టాలని ఎన్ని కోట్లు నిధులు కేటాయించిన స్థానికులకు పథకాల అమలు చేయడంలో పాలకులు విఫలం చెందుతున్నారన్నారు. ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు మాట్లాడుతూ ఏరు దాటకముందు ఓడ మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే చందంగా కూటమి ఎన్డీఏ ప్రభుత్వ ధోరణి ఉందన్నారు. ఎన్నికల రాకముందు భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చి, భవన నిర్మాణ కార్మికుల ఓట్లతో గద్దెనెక్కి మాట మార్చుతున్నారని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కార్మిక శాఖ మంత్రికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేదని, ప్రభుత్వం పై పోరాటానికి కార్మికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి పండగకు భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలపై ప్రభుత్వం తీపి కబురు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు