Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పాలకులకు, అధికారులకు పట్టని బలపం కోరుకొండ ప్రధాన రహదారి

వాహన చోదకులు, బలపం, కుడుము సారి పంచాయతీ ప్రజలకు తప్పని రహదారి కష్టాలు.

కుడుముసారి ఎంపీటీసీ సభ్యురాలు పార్వతి.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – అధ్వాన్నంగా తయారైన బలపం కోరుకొండ రహదారి పాలకులు, అధికారులకు కనిపించక పోవడం దురదృష్ట కరమని కుడుము సారి ఎంపీటీసీ సభ్యురాలు గెమ్మెల పార్వతి అన్నారు. శుక్రవారం చింతపల్లి వచ్చిన ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లు పూర్తి అయినప్పటికీ పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ ప్రాంతం నేటికీ కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. లోతుగెడ్డ వంతెన నుండి రామారావు పాలెం, రాళ్ళగెడ్డ, నిమ్మపాడు మీదుగా బలపం పంచాయతీ కోరుకొండ వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయమై వాహన చోదకులకు, ప్రయాణీకులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుందన్నారు. కుడుముసారి, తమ్మంగుల, బలపం పంచాయతీల లోని సుమారు 70 గిరి గ్రామాలతో పాటు, బలపం పంచాయతీని ఆనుకుని ఉన్న ఒడిస్సా సరిహద్దులోని అనేక గ్రామాల ప్రజలకు ప్రధాన మార్గమైన ఈ రహదారిని విస్మరించడం పాలకులకు, అధికారులకు తగదన్నారు. గతంలో పోలీసుల పుణ్యమా అని తారు రోడ్డు నిర్మాణం పూర్తి అయిందనీ, వైకాపా ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పేరిట సెల్ టవర్ల నిర్మాణం పేరు చెప్పి కేబుల్ కనెక్షన్ అంటూ గుంతలు తవ్వి అంతంత మాత్రంగా ఉన్న ప్రధాన రహదారిని అధ్వాన్నంగా తయారు చేశారన్నారు. ప్రస్తుత పాలకులు, అధికారులు పలుమార్లు ఇదే మార్గాన గడప గడపకు మన ప్రభుత్వం అంటూ తిరిగి ప్రభుత్వం ద్వారా అది చేశాం, ఇది చేశామని చెప్పుకోవడం మినహా ప్రజలకు కనీస అవసరమైన ఈ ప్రధాన రహదారి దుస్థితి పై అటు పాలకులు గానీ, ఇటు అధికారులు గానీ కనీసం దృష్టి సారించిన పాపాన పోలేదని ఆమె విమర్శించారు. ఎన్నో సర్వ సభ్య సమావేశాలలో రహదారి సమస్య లేవనెత్తినా సమస్య పరిష్కారానికి ఏ ఒక్కరూ స్పందించక పోవడం ఈ ప్రభుత్వ నియంతృత్వ విధానానికి నిదర్శనమని, ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి లోతు గెడ్డ వంతెన నుంచి బలపం కోరుకొండ వరకు గల ప్రధాన రహదారిని తారు రోడ్డు గా పునర్నిర్మాణం చేపట్టి ఈ ప్రాంత ప్రజల రహదారి, రవాణా కష్టాలు తీర్చాలని, లేని పక్షంలో రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img