Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

కియా మోటార్ కంపెనీ తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు దే

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహకా కార్యదర్శి సవితమ్మ గురువారం పాత్రికేయులతో మాట్లాడుతూ నేటికీ కియా కంపెనీలో పది లక్షల కార్ల ఉత్పత్తి పూర్తి కావడంతో వైసీపీ మంత్రులు ఎంపీ ,ఎమ్మెల్యేలు నాయకులు అక్కడికి వెళ్లి కియా కంపెనీ జగన్మోహన్ రెడ్డి తెచ్చారని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందనివైసీపీ నాయకులు చేసే ఫేక్ ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లో లేరని సవితమ్మ మండి పడ్డారు. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసింది, కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చినది చంద్రబాబు నాయుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇదేపరిశ్రమకు వద్దకు వచ్చి వైసిపి ప్రభుత్వం అధికారంలో రాగానే మీ భూములు అన్ని మీకు వెనక్కి ఇప్పిస్తానని చెప్పింది వాస్తవం కాదామీకు చేతనైతే కియా కంపెనీకి వచ్చి వెనక్కి వెళ్లిన 14 అనుబంధ సంస్థలను వెనక్కి తీసుకురండి అదేవిధంగా లేపాక్షి నాలెడ్జ్ భూములు 8844 ఎకరాలు ఉన్నాయి లేపాక్షి నాలెడ్జి హబ్ భూముల్లో పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేసి సంపద సృష్టించి స్థానికుల ఉద్యోగాలు ఇవ్వండి అంతేకానీ ఎవరో చేసిన అభివృద్ధిని మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై మండిపడ్డారు ఈకార్యక్రమంలో సోము ,ప్రసాద్,మారుతి,వాసుదేవరెడ్డి, బాలాజీ నాయక్, ఓబులేష్,రాజేష్ ,అంజి,నారాయణ తదితరులుపాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img