Friday, May 31, 2024
Friday, May 31, 2024

అనంతపురంలో రాత్రి వేళ ముమ్మరమైన తనిఖీలు

జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్లలో విస్తృత తనిఖీలు
విశాలాంధ్ర – అనంతపురం : పోలింగ్ సమీపిస్తుండటంతో అనంతపురం నగర పోలీసులు జిల్లా కేంద్రంలో తనిఖీలు విస్తృతం చేశారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో నిన్న రాత్రి నిరవధిక తనిఖీలు కొనసాగాయి. అనంతపురం డీఎస్పీ టి.వి.వి ప్రతాప్ నేతృత్వంలో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్లు, కాలనీలు, శివారు ప్రాంతాలలో వాహనాలను చెకింగ్ చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు, లిక్కర్, ఎన్నికల తాయిలాలకు సంబంధించిన సామాగ్రి అక్రమ రవాణా చేయకుండా నియంత్రించారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించి అనుమానితులను మరియు వారు తీసుకెళ్తున్న లగేజీ బ్యాగులను లోతుగా చెక్ చేశారు. ఈ తనిఖీలలో సి.ఐ లు రెడ్డెప్ప, క్రాంతికుమార్, ధరణీకిశోర్, ప్రతాప్ రెడ్డి మరియు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img