Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వెంకటాపురంలో డా. వై యస్ ఆర్ పొలంబడి కార్యక్రమం

విశాలాంధ్ర,సీతానగరం:మండలంలోని వెంకటపురం గ్రామంలో బుదవారం డాక్టరు వైఎస్సార్ పొలంబడి కార్యక్రమం ఏఓ సవరపు అవినాశ్ ఆధ్వర్యంలో జరిగింది.ఈకార్యక్రమంలో భాగంగా నీమస్త్రం, ద్రవజీవామృతం తయారుచేసి రైతులకి వాటి అవశ్యకత వివరించారు.
నీమస్త్రం ఒకడ్రమ్ములో 200లీటర్లు నీటిని తీసుకొని అందులో 10లీటర్లు ఆవు మూత్రం మరియు రెండు కేజీల ఆవుపేడ వేసి 10 కేజీల వేపాకుల ముద్దవేయాలన్నారు. దీన్ని ఉదయం, సాయంత్రం సవ్య దిశలో కలపాలని,48 గంటలలో నీమస్త్రం తయారు అవుతుందని, 200 లీటర్లు నీమస్త్రం నీరు కలపకుండా పిచికారి చేయాలన్నారు. మూడు నెలల నిల్వ ఉంటుందని,దీని ద్వారా రసం పీల్చే పురుగులు, గుడ్లు, చిన్న చిన్న గొంగళి పురుగులు ,నివారణకి ఉపయోగపడుతుందన్నారు.
ద్రవ జీవామృతం డ్రమ్ములో 200లీటర్లు నీటిలో 10 లీటర్లు ఆవు మూత్రం, 10 కేజీల ఆవుపేడ, వేసి అందులో 2 కేజీల పప్పు దినుసులు పిండి, 2 కేజీల బెల్లం, గుప్పెడు పుట్టమట్టి వేసి సవ్య దిశలో కలపాలన్నారు.ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కలుపుతూ ఉండాలి. 4 రోజులలో ద్రవ జీవామృతం తయారు అవుతుంది. అన్ని పంటలలో ప్రతి 10 రోజుల వ్యవధిలో 200 లీఁ ఒక ఎకరాకు 4 మరియు 5 దఫాలుగా వెయ్యాలి. దీని వలన మొక్కలకు పోషక లభ్యత పెరిగి మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
అదే విధంగా వరి నాట్లు సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అయిన వరి చిగుళ్ళు త్రుంచుట మరియు ఒక చఁమీఁ నాటవలసినా మొక్కల సంఖ్య గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. నాట్లు వేసే సమయంలో కొనలు త్రుంచడం వలన కాండం తొలుచు పురుగు యొక్క గుడ్లు ఆకు చిగురున ఉండి, ప్రధాన పొలంలోకి రాకుండా కాపాడుతుంది. అదే విధంగా ఒక చఁమీఁ కు ఖరీఫ్ కాలంలో అయితే వరి పంటలో 33 కుదుళ్లు వచ్చే విధంగా నాట్లు వేయడం వలన మొక్కకు సరైన గాలి, వెలుతురు తగిలి అధిక దిగుబడికి దోహదం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, పొలంబడి రైతులు, గ్రామ పెద్దలు, గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అంటిపేటలో తాడుపద్దతిలో వరినాట్లు వేసే పద్ధతిని అమలుచేసి నాట్లు వేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img