హిందీ మూలం: అద్‌నాన్ కఫిల్ దర్వేశ్
తెలుగు అనువాదం: డా॥ తక్కోలు మాచిరెడ్డి
గాజాలో ఇండ్లు
చలికి నిలయాలుగా మారిపోయినాయి
వాటిలో కూర్చొని ఉంది మృత్యువు నిమ్మళంగా
80 శాతం నగరంపై
పడివుంది చెత్తలోని, శవాన్ని కప్పే వస్త్రం
దస్త్రం బయట, చలితో దాని కాళ్లు వణుకుతున్నాయి
భయకంపితుల్ని చేసే ప్రతి ధమధమ శబ్దం తర్వాత…
ఎడ తెగకుండా వచ్చిపడే ఇజ్రాయిల్ బాంబుల మధ్య
జనం తమ వారి శవాల్ని వెతుక్కుంటున్నారు
ఎన్నో శవాలు ఇంకా పడి ఉన్నాయి
ఈ పెద్ద ఇటుకల గుట్ట కింద…
కాలానికి లొంగిపోయిన చేతులు
గుట్టల నుంచి తొంగి చూస్తున్నాయి అపుడపుడు
వాటి ఎముకలు ఎప్పుడూ తాకుతుంటాయి అనంతత్వాన్ని
మానవత్వం, విశ్వశాంతి, ఐక్యరాజ్య సమితి, అరబ్‌లీగ్
ప్రజాస్వామ్యపు దట్టమైన నీడలో
గాజాలో ఇప్పటికీ
కాలాన్ని కత్తితో కోస్తున్నాడు ఓ క్రూరుడు
వాటికి అండగా ఓ తెల్లాడు (అసంరా)
కరపుచ్చకాయను కోసినట్లు


