తొగట కులస్తులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని నేసే పేటలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి ఆలయం ఆధ్వర్యంలో దాదాపు 100 మంది మహిళలు బోనాల పండుగను, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు తల పైన బోనాలను పెట్టుకొని ఆనంద పాటలతో దుర్గమ్మ తల్లిని ఆరాధించారు. గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లి అమ్మవారిని ప్రతి సంవత్సరం ఆషాడ మాసం తర్వాత బోనాల పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి),అధ్యక్షులు బంధనాదం రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ, కోశాధికారి బండి నాగరాజ్ తెలిపారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతోనే నేడు ధర్మవరం పట్టణ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవ సేవను అలవర్చుకున్నప్పుడే కుటుంబం సుఖశాంతులతో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో తొగట కులస్తుల కుటుంబీకులు పాల్గొన్నారు.
ఘనంగా బోనాల పండుగ..
- Advertisement -
RELATED ARTICLES


