బీజేపీ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన bజెండా ఉంది. ఆ bజెండాలోని ముఖ్యాంశాలేమిటంటే, విశ్వాన్ని కాషాs¶కరించడం, విద్యను ప్రైవేటీకరించడం, ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అమ్మేయడం, వీలైనంత త్వరగా ప్రాథమిక హక్కులను ఒక్కొక్కటికీ నిర్మూలించడం, లౌకికగణతంత్రసామ్యవాద రహిత కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావడం. కేంద్రంలోని bన్‌డీఏ పాలనను నిశితంగా పరిశీలిస్తే, ఈ bజెండా క్రమం తప్పకుండా అమలవుతున్నట్లు కన్పిస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (bంజీనరేగా) రద్దుచేస్తూ వికసిత్ భారత్ గ్రామ్ (విబి గ్రామ్) పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రభుత్వ విధానాలు ఏ దిశగా పోతున్నాయో తెలుసుకోవడానికి ఇదొక్కటి చాలు. బీజేపీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (bంజీbనఆరఈజీఏ)ను bందుకు రద్దు చేసింది? అది సరిగ్గా అమలు కావడం లేదా? ఈ ప్రశ్నకు సమాధానమే లేదు. bందుకంటే, దేశంలో సజావుగా అమలవుతున్న అతితక్కువ చట్టాల్లో ఇదొకటి. పోనీ అవినీతి పేరుకుపోయిందని చెపుదామంటే, అది నివారించదగ్గ జాఢ్యమే. అవినీతి పేరుతో ఏకంగా చట్టాన్నే రద్దుచేయాల్సిన పనిలేదు. పైగా దీంట్లో అవినీతి చాలా స్వల్పమని నివేదికలే చెపుతున్నాయి. సరైన నియంత్రణతో దాన్ని అరికట్టవచ్చు. అంతేతప్ప చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదు. గాంధీని చంపిన గాడ్సే వారసులుగా మహాత్ముని పేరు ఈ పథకంలో ఉండటానికి ఇష్టం లేదు కాబట్టి దాన్ని రద్దు చేశారని అనుకుంటే, ఆ వాదన పరిపూర్ణం కాదని చెప్పవచ్చు. bందుకంటే, నరేగా చట్ట స్వభావాన్నే పూర్తిగా మార్చిపడేశారు. పనిగంటలు పెంపు మినహా కొత్త చట్టంలో ఏ ఒక్క అంశవ¶ గ్రామీణ కార్మికులకు అనుకూలంగా లేదు. అందులోనూ, ఉపాధి హక్కునే తొలగించడానికి చేసిన అతిపెద్ద ఏర్పాటులా ఇది కన్పిస్తోంది.
కొత్త చట్టం పేరు వికసిత్ భారత్ రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ (వీబీ గ్రామ్ జీ). అంటే జీ రామ్ జీ అని ఉచ్ఛారణ వచ్చేలా ప్రభుత్వం తన బాధను తీర్చేసుకుంది. హిందీయేతర భాషా రాష్ట్రాల ప్రజలు దీన్ని ఉచ్ఛరించడవ¶ కష్టమే. నిజానికి, já¶పీఏ ప్రభుత్వహయాంలో వామపక్ష పార్టీల నిరంతర, నిర్ణయాత్మక జోక్యం ఫలితంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆవిర్భవించింది. గ్రామీణ కార్మికులకు వేతన ఉపాధి, జీవనోపాధి భద్రతకు హామీ ఇచ్చే ఒక చారిత్రాత్మక హక్కుల ఆధారిత చట్టం. రాజ్యాంగ నిబద్ధతలో పాతుకుపోయిన ఈ చట్టం, ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ చట్టంగా అంతర్జాతీయ సమాజంలో ప్రశంసలు పొందింది. ఈ కీలకమైన సామాజిక భద్రతా చర్యను బలోపేతం చేయడానికి బదులుగా, ప్రస్తుత ప్రభుత్వం అసంపూర్ణ బడ్జెట్ కేటాయింపులు, వేతన చెల్లింపులలో జాప్యం, పని నిరాకరణ, తప్పనిసరి ఆధార్ ఆధారిత వ్యవస్థలు, bన్bంbంbస్, కేవైసీ జాబ్ కార్డు, చట్టం ప్రకారం ఉన్న చట్టబద్ధమైన హామీని నీరుగార్చే పరిపాలనా నియంత్రణలను ప్రవేశపెట్టడం ద్వారా దీనిని క్రమపద్ధతిలో బలహీనపరిచింది. సం¿ాìప్తంగా చెప్పాలంటే, బీజేపీ రాజకీయ వైరం, ప్రతీకారంతో ఉపాధి హామీని నిర్వీర్యం చేసింది. ప్రభుత్వం అనుసరించిన దారుణమైన క్రూరత్వానికి లక్షలాది మంది పేద, నిస్సహాయ, అణగారిన వర్గాల ప్రజలు నష్టపోతున్నారు. నరేగాకు ప్రత్యామ్నాయంగా ముందుకు తీసుకువస్తున్న వికసిత్ భారత్ గ్రామ్ పాత చట్టం కింద హామీ ఇచ్చిన ఉపాధికి చట్టపరమైన హామీని రద్దు చేసి, దాని స్థానంలో విచక్షణతో కూడిన, పథకం ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేసిందని స్పష్టంగా గోచరిస్తున్నది. కొత్తచట్టాన్ని కనిపెట్టడంలో రెండు అంశాలు కన్పిస్తున్నాయి. మొదటిది కార్మికుల హక్కులను ప్రాథమికంగా వెనక్కి తీసుకోవడం, రెండోవది కేంద్ర ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యత నుండి వైదొలగడం.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మాత్రమే కాదు, శ్రమ గౌరవం, గ్రామీణ స్వయం సమద్ధి వంటి గాంధీ ఆశయాలను సైతం ఇది ప్రతిబింబిస్తుంది. ఇటువంటి మహోన్నత కార్యక్రమాన్ని బలహీనపరచడం, అణగదొక్కడం ద్వారా గాంధీ వారసత్వాన్ని చెరిపివేయడానికి చేస్తున్న ప్రయత్నం నిందాపూరితం, రాజకీయ ప్రేరేపితం. చరిత్రను వక్రీకరించడానికి, స్వాతంత్య్ర ఉద్యమ విలువలను అగౌరవపరచడానికి బీజేపీ అనుసరిస్తున్న విస్తత bజెండాలో ఇది మరో ఉదాహరణ. అంతేగాకుండా, కొత్త చట్టం వీబీ గ్రామ్ జీని భారతీయ సమాఖ్య వ్యవస్థపై తీవ్రమైన దాడిగా పరిగణించవచ్చు. ఇది ఉపాధి హక్కును మింగేసింది. కేంద్ర నిధులు హామీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక, పరిపాలనా భారాన్ని మోపడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను రాష్ట్రాలపైకి మారుస్తోంది, వీటిలో చాలా వరకు అధికార వికేంద్రీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాలలో ఏకపక్ష కోతల కారణంగా ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిని bదుర్కొంటున్నాయి. పేదరికం, నిరుద్యోగం, వలసలు, వ్యవసాయ సంక్షోభం వంటి సమస్యలను సౌందర్య నామకరణం, ప్రచార ఆధారిత పథకాల ద్వారా పరిష్కరించలేం. bంజీbనఆరఈజీఏ పథకంలో సరిచేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. కాదనలేం. అవేమిటంటే, పనిదినాలను పెంచడం, కనీస వేతనాలతో ముడిపడి ఉండేలా వేతనాలు పెంచడం, సకాలంలో చెల్లింపులు చేయడం, సార్వజనీన ప్రాప్యత (అందరికీ యాక్సెస్ ఉండేలా చేయడం) వంటి అంశాలను మెరుగుపరిస్తే సరిపోతుంది. ఆ పథకం మరింత గొప్ప పథకమయ్యేది. అలా చేయకుండా, పేరు మార్చిపడేసి, కూలీల రక్తాన్ని పిండేసి, పొట్టలు కొట్టేసి, హక్కులను లాగేసి, వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి, కార్పొరేట్ల జేబులు నింపేసి… కొత్త పేర్లుతో సాధించేదేముంటుంది? అందుకే, తగినంత బడ్జెట్ కేటాయింపుతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి. దాన్ని మరింత బలోపేతం చేయాలి. ఈ పథకానికి ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చిన జీ రామ్ జీ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. bలాంటి మినహాయింపులు, సాంకేతిక అడ్డంకులు లేకుండా bంజీbనఆరఈజీఏ కింద ఉపాధికి చట్టబద్ధమైన హామీకి పూర్తి గౌరవం ఉంటుందని గుర్తించాలి. రోజుకు రూ.700 కనీస వేతనంతో 200 రోజుల ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం తన చట్టబద్ధమైన ఆర్థిక బాధ్యతను భరించడం ద్వారా సమాఖ్య సూత్రాల రక్షణకు కట్టుబడి ఉండాలి. కష్టపడి సంపాదించుకున్న హక్కులను కూల్చివేసే ప్రభుత్వాలను ప్రతిఘటించాలని, సామాజిక న్యాయం, ఆర్థిక భద్రతకు వ¶లస్తంభంగా ఉన్న bంజీనరేగాను పునరుద్ధరించాలని ఇటీవలనే సీపీఐ జాతీయ కౌన్సిల్ కూడా తీర్మానం చేసిన విషయం తెల్సిందే.
ఉపాధి హక్కును మింగేసింది!
- Advertisement -


