పై చేయి సాధించిన ఆఫ్రికా, కరేబియన్ దేశాలు
ఐరాస: ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్టొబాగో, జింబాబ్వే దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యÖఎన్‌జీఎస్‌సీ)లో తాత్కాలిక సభ్యత్వం లభించింది. రెండేళ్ల పాటు ఐరాస సభ్యదేశాలుగా ఇవి కొనసాగుతాయి. 193 సభ్య దేశాలుగల ఐరాస భద్రతా మండలి 202728 ఎన్నిక బుధవారం జరిగింది. డెన్మార్క్, గ్రీస్, పాకిస్థాన్, పనామా, సొమాలియా పదవీ కాలం ముగిసింది. వీటి స్థానంలో ఆస్ట్రియా, కిర్గిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్టొబాగో, జింబాబ్వే ఎన్నికయ్యాయి. తాత్కాలిక సభ్యదేశాల పదవీ కాలం 2027, జనవరి నుంచి 2028, డిసెంబరు 31 వరకు ఉంటుంది. ఈ పరిణామం జర్మనీకి ఎదురు దెబ్బగా పరిణమించింది. వెస్టరన్ యÖరోపియన్‌తో పాటు ఇతర విభాగాల్లో ఈ దేశం ఓడిపోయింది. 104 ఓట్లకు పరిమితమైంది. పోర్చుగల్‌కు 134, ఆస్ట్రియాకు 131 చొప్ప్పున ఓట్లు రాగా జింబాబ్వేకు 182, కిర్గిస్థాన్‌కు 142 ఓట్లు వచ్చాయి. లాటిన్ అమెరికా, కరేబియన్ దేశం ట్రినిడాడ్టొబాగోకు 181 ఓట్లు లభించాయి. కిర్గిస్థాన్ మొదటిసారి భద్రతా మండలికి ఎన్నికైంది. నాలుగు రౌండ్ల హోరాహోరీలో ఫిలిప్పీన్స్‌ను ఓడించింది. ఐరాస సర్వసభ సమావేశం అధ్యక్షులు, జర్మన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అన్నాలెనా బెయర్‌బాక్ ఈ ఫలితాలు ప్రకటించారు. ఐరాస కేంద్ర కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో జర్మన్ విదేశీ వ్యవహారాల మంత్రి జొహన్ వాడెపుల్ మాల్లాడుతూ ఈ ఫలితం నిరాశపరిచిందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. జర్మనీ ప్రవేశం ఆలస్యం కావడంతోనే నష్టం తప్పలేదన్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు, ఇజ్రాయిల్‌పై వైఖరే తమకు ప్రతికూలంగా పరిణమించినట్లు అన్నాలెనా బెయర్‌బాక్ అభిప్రాయపడ్డారు.
ఐరాసలో జర్మనీకి దెబ్బ
- Advertisement -
RELATED ARTICLES


