రాష్ట్రాల ఆర్థిక స్థితిని మరింత బలపరిచేందుకు, మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పన్నుల వాటా కింద దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ఒక్కసారిగా రూ.1,09,019 కోట్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల వాటా (ట్యాక్స్ డెవల్యూషన్) కింద భారీ మొత్తాన్ని విడుదల చేసింది. ఆగస్టులో దేశవ్యాప్తంగా రూ.1,09,019 కోట్లు విడుదల చేయగా అందులో తెలంగాణకు రూ.2,370 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు ముందస్తుగా కేటాయించింది. సాధారణంగా ప్రతి నెల 10వ తేదీన విడుదలయ్యే నిధులను ఈసారి ముందుగానే అందించడం రాష్ట్రాలకు ఆర్థికంగా ఊరటనిచ్చింది.
పన్నుల వాటాలో గణనీయమైన పెరుగుదల : తెలంగాణకు 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల వాటాలో పెరుగుదల లభించింది. కేంద్రం నుంచి అదనపు వాటా ముందుగానే అందడంతో తెలుగు రాష్ట్రాలు నిధుల సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశముంది. మూలధన వ్యయం పెంచడానికి, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరాయంగా అమలు చేయడానికి ఈ నిధులు ఎంతగానో దోహదపడతాయని కేంద్రం తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో (2021-26) కేంద్ర పన్నుల వాటా కింద తెలంగాణకి రూ.1.75 లక్షల కోట్లు లభించాయి. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు తెలంగాణ హారిజాంటల్ వాటా శాతం 2.102 నుండి 2.174 శాతానికి పెరిగింది.గత ఐదేళ్ల లో మొత్తం నిధులు కాగా రూ.1.75 లక్షల కోట్లు (2021-26 మధ్య). వాటా శాతం 2.102% నుండి 2.174%కి పెరిగింది. దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపు : దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర నిధుల కేటాయింపు భారీగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,597 కోట్లు దక్కగా, కర్ణాటకకు రూ.4,504 కోట్లు, తమిళనాడుకు రూ.4,466 కోట్లు అందాయి. రాజస్థాన్ ఖాతాలో రూ.6,460 కోట్లు, ఒడిశాకు రూ.4,819 కోట్లు జమయ్యాయి. చిన్న రాష్ట్రాల విషయానికొస్తే సిక్కింకు రూ.365 కోట్లు, గోవాకు రూ.398 కోట్లు, నాగాలాండ్‌కు రూ.524 కోట్లు కేటాయించారు. కేంద్రం విడుదల చేసిన మొత్తంలో జనాభా, ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం అత్యధిక లబ్ధి పొందిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. యూపీకి అత్యధికంగా రూ.19,208 కోట్లు దక్కాయి. ఆ తర్వాత స్థానాల్లో బిహార్‌కు రూ.10,845 కోట్లు, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి రూ.8,010 కోట్లు కేటాయించారు. పశ్చిమ బెంగాల్కు రూ.7,866 కోట్లు, మహారాష్ట్రకు రూ.7,022 కోట్లు లభించాయి.
తెలంగాణకు మొత్తం రూ.33,180.78 కోట్లు : రాష్ట్ర హారిజాంటల్ వాటా 15వ ఆర్థిక సంఘం నిర్ణయించిన 2.102 శాతం నుంచి 2.174 శాతానికి పెరగడంతో, కేంద్ర బడ్జెట్ ప్రకారం తెలంగాణకు మొత్తం రూ.33,180.78 కోట్లు రానున్నాయి. ఈ పెరుగుదల వల్ల గత లెక్కల ప్రకారం రావాల్సిన రూ.32,081.88 కోట్లతో పోలిస్తే అదనంగా రూ.1,098.90 కోట్లు రాష్ట్రానికి లభించనున్నాయి. విపత్తుల నిర్వహణ, పన్నుల వసూళ్లు, విద్యుత్ సంస్కరణల్లో రాష్ట్రం సాధించిన పురోగతిని పరిగణనలోకి తీసుకుని ఈ పెంపు చేసినట్లు వెల్లడైంది. 2025-26లో కేంద్ర పన్నుల వాటా కింద రూ.29,899 కోట్లు వస్తాయని అంచనా ఉండగా, తాజా బడ్జెట్ ప్రకారం రూ.33,180.78 కోట్లు లభించనున్నాయి. దీంతో గత అంచనాలతో పోలిస్తే రూ.3,281.78 కోట్లు అదనంగా రాష్ట్ర ఖజానాకు చేరనున్నాయి. సాధారణంగా ప్రతి నెలా 10న కేంద్ర పన్నుల వాటా నిధులు రాష్ట్రాలకు అందుతాయి. ఈసారి ఆగస్టు 10న ఇచ్చే రెగ్యులర్ నిధులకు అదనంగా, పది రోజుల ముందే ఈ భారీ అడ్వాన్స్‌ను కేంద్రం రిలీజ్ చేసింది. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రోడ్లు, ప్రాజెక్టులు వంటి ‘క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్’ పనులను వేగవంతం చేయడానికే ఈ ముందస్తు పంపిణీ చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. చేతిలో సరిపడా నిధులు ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి పనుల్లో మరింత వేగవంతంగా ముందుకెళ్తాయని కేంద్రం భావిస్తోంది. గతంలో ఉన్న 2.102 శాతాన్ని 2.174 శాతానికి 16వ ఫైనాన్సక్కమిషన్పెంచింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం.. రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో రూ.33,181 కోట్లు రానున్నాయి. అంటే గతం కంటే దాదాపు రూ.4 వేల కోట్లు అదనంగా అందనున్నాయి. ఈ లెక్కన నెలకు సగటున రూ.2,370 కోట్ల చొప్పున రాష్ట్ర ఖజానాకు నిధులు వస్తాయి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కావడంతో పాటు అటవీ విస్తీర్ణం పెంచడం, జనాభాను నియంత్రణ చర్యల ఫలితంగా ఈ అదనపు వాటా దక్కింది. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో పన్నుల వాటా రూపంలో రానున్న రూ.2.27 లక్షల కోట్లకు తోడు అదనంగా స్థానిక సంస్థలు, హెల్త్, విపత్తు నిధుల రూపంలో మరో రూ.30,315 కోట్లు తెలంగాణకు దక్కనున్నాయి. అంటే మొత్తమ్మీద కేంద్రం నుంచి అందే నిధుల వాటా రూ.2.57 లక్షల కోట్లు దాటనుంది. ఇది గతం కంటే సుమారు రూ.60 వేల కోట్లు ఎక్కువ.
ట్యాక్స్ డెవల్యూషన్ అంటే ఏమిటి : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వసూలు చేసే వివిధ పన్నుల్లో ఒక నిర్దిష్ట శాతాన్ని ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. దీనినే ట్యాక్స్ డెవల్యూషన్ అంటారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ నిర్వహణ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులు కీలక ఆధారంగా నిలుస్తాయి. అంతేకాకుండా, ఆగస్టు 10న విడుదలయ్యే సాధారణ నెలవారీ పన్నుల వాటాను కేంద్రం విడుదల చేసింది. దీంతో ఒకే నెలలో రెండుసార్లు నిధులు అందన్ను నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి మరింత ఊరట లభించనుంది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి దక్కన్ను పన్నుల వాటా అంచనా రూ.కోట్లలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 33,181 కాగా, 2027-28 నాటికి రూ.40,023, 2028-29కి రూ.44,828, 2029-30 నాటికి రూ.50,219, 2030-31 నాటికి రూ.56,263 నిధులుగా ఉన్నాయి.
సీనియర్ జర్నలిస్ట్ , సెల్ : 93973 99298
కేంద్ర పన్నుల వాటాతో ఊరట
- Advertisement -


