న్యూదిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సూర్యకాంత్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. దీంతో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోప్‌ాతక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1985లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పని చేసిన జస్టిస్ సూర్యకాంత్… అనేక కీలక తీర్పుల్లో భాగమయ్యారు.
నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం
- Advertisement -
RELATED ARTICLES


