Homeక్రీడలుబౌలర్లే కొంప ముంచారు

బౌలర్లే కొంప ముంచారు

- Advertisement -

హార్దిక్ పాండ్య
ముంబై: సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళ వారం రాత్రి గువహతిలో రాజ స్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యనేతత్వంలోని ముంబై జట్టు పూర్తిగా తేలిపోయింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత బౌలింగ్ యూనిట్‌దేనని పాండ్య తెలి పాడు. కనీసం ఐదు మంచి బంతు లేసినా తమకు గెలిచే అవకాశం ఉండేదన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ “మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి నుంచే మాకు భారీ షాట్లు ఆడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, మేం బౌలింగ్‌లోనే సరిగ్గా రాణించలేదు. నాతో సహా మా బౌలింగ్ బృందం విఫలమైంది. ఈ ఓటమికి బౌలింగ్ యూనిట్‌దే బాధ్యత. కనీసం ఐదు బంతులైనా సిక్సర్లు వెళ్లకుండా కట్టడి చేయా ల్సింది. అప్పుడు ముంబై పోరాడేం దుకు అవకాశం లభించేది” అని పాండ్య తెలిపాడు. ఇక రాజస్థాన్ జట్టు గొప్పగా ఆడిందని ప్రశం సలు కురిపించాడు. ఆ జట్టు ఓపెనర్లు తొలి రెండు ఓవర్లలోనే గేమ్‌ను మా నుంచి లాగేసుకు న్నారన్నాడు. ఆ తర్వాత ఇన్నిం గ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నిం చినా.. వెనకబడిపోయామని తెలిపాడు. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 3 వికెట్లకు 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై సీనియర్ బౌలర్లు బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, శార్దూల్ ఠాకుర్, దీపక్ చాహర్ తేలిపోయారు. ధారాళంగా పరుగులిచ్చేశారు. లక్ష్య ఛేదనలో పాండ్య సేన 123 పరుగులకే పరిమితమైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు