Tuesday, July 15, 2025
Homeవిశ్లేషణరాజ్యాంగం విధ్వంసానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధం

రాజ్యాంగం విధ్వంసానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధం

కృష్ణ

రాజ్యాంగాన్ని ధ్వంసంచేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ పూనుకోవడం ఇది మొదటిసారికాదు. రాజ్యాంగం అవతారికలోని ‘సోషలిస్టు’ , ‘సెక్యులర్‌’ పదాలను తొలగించి తీరాలని దత్తాత్రేయ హోసబలే ప్రతిపాదించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ డిమాండ్‌ను దీర్ఘకాలికంగా పెడుతూనే ఉంది. అవతారికలో సోషలిజం, సెక్యులరిజాన్ని అసహేతుకంగా చేర్చలేదు. స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించి రచించుకున్న రాజ్యాంగంలోని కీలకమైన విలువలివి.

రాజ్యాంగం విధ్వంసానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధంగా ఉన్నదని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టంగా అర్థమైంది. రాజ్యాంగం అవతారికలోని ‘సోషలిస్టు’ , ‘సెక్యులర్‌’ పదాలను తొలగించి తీరాలని దత్తాత్రేయ హోసబలే ప్రతిపాదించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ డిమాండ్‌ను దీర్ఘకాలికంగా పెడుతూనే ఉంది. ఈ పదాలను ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో అవతారికలో చేర్చినప్పటికీ అంత క్రితమే ఆర్టికల్‌ 25లోని క్లాజు (2) (ఏ) కింద సెక్యులర్‌ పదాన్ని చేర్చారు. ఈ అంశం రాజ్యాంగాన్ని పఠించిన నిపుణులకు తెలుసు. స్వాతంత్య్ర పోరాటానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు, కార్యకర్తలకు తెలిసి ఉండకపోవచ్చు. అవతారిక నుంచి సెక్యులర్‌, సోషలిస్టు పదాలను తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సాగిస్తున్న ప్రచారం కేవలం రాజ్యాంగంపై దాడి. భారత దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్పు చేసేందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని విధ్వంసం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందేందుకు స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటానికి, కలలకు సజీవ చట్టబద్ద పత్రమే రాజ్యాంగం. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సెక్యులర్‌, సోషలిస్టు పదాలను అవతారిక నుంచి తొలగించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చివేసి హిందూరాష్ట్రను నెలకొల్పాలని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు పట్టువిడవకుండా అనేక రకాల ప్రయత్నాలను సాగిస్తూనే ఉన్నది.
అవతారికలో సోషలిజం, సెక్యులరిజాన్ని అసహేతుకంగా చేర్చలేదు. స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించి రచించుకున్న రాజ్యాంగంలోని కీలకమైన విలువలివి. స్వాతంత్య్ర పోరాటయోధుల భావజాలాన్ని రాజ్యాంగంలోని ప్రతి ప్రొవిజన్‌ ప్రతిబింబిస్తోంది. ఇందిరాగాంధీ పాలనా కాలంలో అవతారికలో చేర్చిన ఈ పదాలు కేవలం కొనసాగింపుగా చేర్చినవి మాత్రమే. రాజ్యాంగంలోని అవతారికలో చేర్చిన పదాలు అత్యంతకీలకమైనవి. అవతారికనే మార్పుచేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం రాజ్యాంగాన్ని, దాని విలువలను నాశనం చేయడానికి తప్పితే మరొకటి కాదు. అంబేద్కర్‌ నాయకత్వంలో రచించిన రాజ్యాంగంలో సెక్యులర్‌ పదం లేదని హోసబలే వాదిస్తున్నారు. 1976లో రాజ్యాంగంలో సెక్యులర్‌ పదం చేర్చడానికి ముందే ఈ పదాన్ని ప్రాథóమిక హక్కులలో రాజ్యాంగం మూడవభాగంలో చేర్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మతాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్పు చేయాలన్న భావనను చాలా కాలంగా వ్యక్తం చేస్తూనే ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌ కేవలం అవతారికను తొలగించాలని మాత్రమేకాక, పూర్తి రాజ్యాంగాన్ని మార్చివేయాలని కోరుకుంటోంది. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ రూపకర్తలు రాజ్యాంగంలో చేర్చిన విలువలను ఆర్‌ఎస్‌ఎస్‌ సహించలేకపోతోంది. స్వాతంత్య్ర పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి పాత్ర లేదు. పైగా వలసపాలకులైన బ్రిటీష్‌ వారితో కలిసిపోయారు. వారికి అనుకూలంగా పనిచేశారు. మతం ఆధారంగా ప్రజలను చీల్చడం ద్వారా స్వాతంత్య్ర ఉద్యమాన్ని బలహీనపరచేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ తొలి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. విభజించి పాలించు అన్న వ్యూహంతో వలస పాలకులకు ఆర్‌ఎస్‌ఎస్‌ అన్నివిధాలుగా తోడ్పడిరది.
రాజ్యాంగాన్ని ధ్వంసంచేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ పూనుకోవడం ఇది మొదటిసారికాదు. తన మాటలు, చర్యల ద్వారా పదేపదే ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ప్రచారాన్ని సాగిస్తున్నది. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ అంశాన్ని బీజేపీ నాయకులు ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి అనేక ప్రకటనలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రకటించారు. హోం మంత్రి అమిత్‌షా అవతారిక నుంచి సెక్యులర్‌ పదాన్ని తొలగించబోమని కపట ప్రేమను చూపించారు. బీజేపీ నాయకులు తమకు 400సీట్లు లభించినట్లయితే రాజ్యాంగం నుంచి సెక్యులర్‌ పదాన్ని తొలగిస్తామని చెప్పలేదని అమిత్‌ షా అన్నారు. ఇదంతా నటన అనేది ప్రజలకు తెలియని విషయమేమీ కాదు. రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రగల్బాలు పలుకుతూనే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీకి 240 సీట్లు మాత్రమే లభించాయి. అంతక్రితం లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు పొందిన బీజేపీ ప్రజలలో తన ఆదరణను గణనీయంగా కోల్పోయింది. సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను తొలగించాలని దత్తాత్రేయ హోసబలే చేసిన ప్రతిపాదనకు అనేకమంది బీజేపీ నాయకులు తమ మద్దతును ప్రకటించారు. వీరిలో కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, జితేంద్ర సింగ్‌, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఉన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ వీరికంటే కాస్త ముందున్నారు. అవతారికలో సోషలిస్టు, సెక్యులర్‌ పదాలను చేర్చడం ‘‘సనాతన ధర్మానికి అపరాధం’’ అవుతుందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చివేయాలన్న భావనను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పదేపదే వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవంగా రాజ్యాంగ అసెంబ్లీ మొత్తం సెక్యులర్‌ భావజాలాన్ని పొందుపరచేందుకు తీవ్రంగా కృషిచేసింది. 1949 అక్టోబరు 14వ తేదీన రాజ్యాంగ అసెంబ్లీలో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ ఈ విధంగా ప్రకటించారు. స్వేచ్ఛను పొందిన భారతదేశం సెక్యులర్‌ దేశమన్న పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించలేరని నేను స్పష్టంగా ప్రకటిస్తున్నాను అని అన్నారు.
రాజ్యాంగ అసెంబ్లీలోని మరో సభ్యుడు టిజేఎం విల్సన్‌ 1949, నవంబరు 23వ తేదీన సెక్యులర్‌ రాజ్యం ప్రాధాన్యతను ప్రకటించారు. ‘‘రాజ్యాంగం ద్వారా సెక్యులర్‌ లక్షణాన్ని, సెక్యులర్‌ రాజ్యాన్ని పొందడం అతిగొప్ప విజయం’’ అని అన్నారు. ఇంకా ఆయన ఇలా హెచ్చరించారు. రాజ్యం సెక్యులర్‌ లక్షణాన్ని చీకటిలోకి తోసేందుకు పురోగమన శక్తులను బెదిరిస్తున్నారు. మనం ఎంతగానో ప్రేమించే ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మార్గదర్వకత్వంలో మన నాయకత్వం ముందుకు నడవాలని నేను ప్రార్థిస్తున్నాను. అత్యధిక ఐరోపా దేశాలు, ఆసియా చీకటిలో పయనిస్తూ స్వాతంత్య్రం పొంది తిరిగి విధ్వంసానికి గురికావడాన్ని అనుమతించవద్దని కోరుతున్నానని చెప్పారు. రాజ్యాంగంలోని అవతారికలో సోషలిజం, సెక్యులరిజం పదాలను చేర్చడాన్ని మన సుప్రీంకోర్టు సైతం ధృవీకరించింది. ఈ పదాలను చేర్చడాన్ని సవాలుచేస్తూ దాఖలుచేసిన పిటిషన్‌లను మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

1949 అక్టోబరు 14వ తేదీన రాజ్యాంగ అసెంబ్లీలో సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ ఈ విధంగా ప్రకటించారు. స్వేచ్ఛను పొందిన భారతదేశం సెక్యులర్‌ దేశమన్న పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించలేరని నేను స్పష్టంగా ప్రకటిస్తున్నాను అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు