Homeఅంతర్జాతీయంవిభజనకు శత్రువుల కుట్ర

విభజనకు శత్రువుల కుట్ర

- Advertisement -

ముజ్తాబా ఖామేనీ హెచ్చరిక: జాతీయ ఐక్యతకు పిలుపు

తెహ్రాన్: యుద్ధ క్షేత్రంలో చిత్తైన శుత్రువులు (అమెరికా`ఇజ్రాయిల్) తమ దేశాన్ని అస్థిరపర్చాలని ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధినేత అయాతుల్లా ముజ్తాబా ఖామేనీ హెచ్చరించారు. ఇరాన్ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు, వారితో అనుమాన బీజాలు నాటుతున్నట్లు ఆరోపించారు. ఇందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిస్తూ గురువారం ఒక సందేశమిచ్చారు. అనుమానం, భయం, నిరాశ, అపనమ్మకం భావాలు కలిగిస్తూ విభజన లక్ష్యంతో విష బీజాలు నాటి ఇరాన్ ప్రజలను విడదీయాలని దుష్ట్ర ప్రయత్నాలుజరుగుతున్నట్లు హెచ్చరించారు. ఇరాన్ ప్రజలంతా సుస్థిరతను, వివేకాన్ని, ఐక్యతను కాపాడుకోవాలని ముజ్తాబా సూచించారు. తద్వారా శత్రువుల దుష్ట కుట్రను తిప్పికొట్టాలన్నారు. ప్రస్తుత విపత్తుకర పరిస్థితుల్లో ఒక్కటిగా ఉండాలంటూ జాతీయ ఐక్యతకు పిలుపునిచ్చారు. ప్రజలలో నిస్పృహకు దారితీసే ఎలాంటి ఒక్క చర్య జరిగినా అది శత్రువులకు లబ్ధి చేకూరుస్తుందని హెచ్చరించారు. శత్రువుల ఉచ్చులో చిక్కుకోవద్దని, ఐకమత్యమే బలమంటూ ముజ్తబా ఐక్యతా సందేశమిచ్చారు. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు రూహుల్లా ఖామేనీ వర్ధంతి సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ముజ్తాబా రాతపూర్వకంగా పంపిన సందేశాన్ని సంబంధిత ప్రతినిధి చదివి వినిపించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు